సెల్‌ఫోన్ పేలి యువతికి తీవ్ర గాయాలు

by Shamantha N |

సెల్‌ఫోన్ పేలి ఓ యువతి తీవ్రంగా గాయపడింది. ఈ ఘటన తమిళనాడులో ఆలస్యంగా వెలుగు చూసింది. తిరువారూరు జిల్లాలోని నీడామంగళం ముట్టయ్యకొత్తనార్ తందు ప్రాంతానికి చెందిన సుకుమార్ అనే వ్యక్తి ఉద్యోగం నిమిత్తం విదేశాల్లో ఉంటున్నాడు. ఆయన కుమార్తె ఆర్తి సోమవారం తండ్రితో వీడియో కాల్ మాట్లాడాలనుకుంది. అయితే సెల్‌ ఫోన్‌లో చార్జింగ్ లేకపోవడంతో చార్జింగ్ పెట్టి మాట్లాడుతుంది. ఇంతలోనే సెల్‌ఫోన్ ఒక్కసారిగా భారీ శబ్దంతో పేలింది. సెల్ ముక్కలు యువతి కళ్లలోకి, చెవికి బలంగా తాకాయి. దీంతో ఆర్తి తీవ్రంగా గాయపడింది. కుటుంబ సభ్యులు ఆమెను దగ్గరలోని ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స చేయించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం ఆర్తిని తంజావూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

Tags: young girl, injured, mobile blast, video call, tamil nadu

Advertisement

Next Story

Most Viewed