- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘ఐదేళ్లు సహజీవనం చేసి ఇప్పుడొద్దంటున్నాడు’
దిశ, వేములవాడ: పెళ్లి చేసుకుంటానని నమ్మించి తనతో సహజీవనం చేసి మోసం చేశాడంటూ ప్రియురాలు రోడ్డుపై ధర్నాకు దిగింది. ప్రేమ పేరుతో తనను మోసం చేసిన వ్యక్తితో తనకు పెళ్లి జరిపించాలని డిమాండ్ చేస్తోంది. పెళ్లి చేసుకునే వరకు వదిలేది లేదంటూ న్యాయ పోరాటానికి దిగింది. ఈ సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గంలోని రుద్రంగి మండల కేంద్రంలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. రుద్రంగి మండల కేంద్రానికి చెందిన ఓ యువతి, జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం తిరుమలాపూర్ గ్రామానికి చెందిన తిరుమల్ అలియాస్ బాబ్జీ అనే వ్యక్తిని ప్రేమించింది. ఐదేళ్ల నుంచి వీరిద్దరూ సహజీవనం చేశారు. అయితే, తనను పెళ్లి చేసుకోవాలని ప్రియుడిని కోరడంతో అతను అందుకు నిరాకరిస్తున్నాడని ప్రియురాలు రుద్రంగి మండల కేంద్రంలో ధర్నాకు దిగింది. తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తోంది. ఈ విషయమై యువతి కుటుంబ సభ్యులు మాట్లాడుతూ.. వారిద్దరూ ప్రేమించుకున్నారని, బతుకుదెరువు కోసం వీరిద్దరూ కలిసి గల్ఫ్ దేశానికి కూడా వెళ్లారని తెలిపారు. యువతిని పెళ్లి చేసుకోవాలని వారు తిరుమల్ ను కోరామని, పెళ్లి విషయం ప్రస్తావనకు రావడంతో తిరుమల్ ముఖం చాటేశాడని వారు చెబుతున్నారు. తన కూతురికి న్యాయం చేయాలని కోరుతూ 15 రోజుల క్రితం రుద్రంగి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడానికి వెళ్తే పోలీసులు కేసు నమోదు చేయకుండా పెద్దమనుషుల సమక్షంలో మాట్లాడుకోవాలని ఉచిత సలహాలు ఇచ్చారంటూ వాపోయారు. ఈ విషయం తెలిసి స్థానికులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. కాపాడాల్సిన పోలీసులే ఇలా చేస్తే ఎలా అంటూ ప్రశ్నిస్తున్నారు. ఆ యువతికి న్యాయం చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు.
- Tags
- dharna
- Karimnagar