విద్యుద్ఘాతంతో యువరైతు మృతి

by Shyam |   ( Updated:2020-04-27 01:18:22.0  )
విద్యుద్ఘాతంతో యువరైతు మృతి
X

దిశ, మెదక్: అడవి పందుల నుంచి పంటను రక్షించుకోడానికి పంట చుట్టూ ఏర్పాటు చేసిన తీగకు విద్యుత్ సరఫరా చేసే ప్రయత్నంలో షాక్ తగిలి యువరైతు మృతిచెందాడు. ఈ ఘటన మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం ఉప్పులింగాపూర్‌లో చోటు చేసుకుంది. వెల్దుర్తి ఎస్ఐ గంగరాజు వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన మహమ్మద్ జహంగీర్(28) ప్లంబర్‌గా పని చేస్తూ భార్యాపిల్లలతో కలిసి తూప్రాన్‌లో నివాసం ఉంటున్నాడు. గ్రామంలోని ఆయన పొలంలో మొక్కజొన్న పంట సాగు చేశాడు. పంట రక్షణకు చుట్టూ కరెంట్ తీగలను ఏర్పాటు చేసి రాత్రి వేళ విద్యుత్తు సరఫరా చేయడం, తెల్లవారుజామున వచ్చి తొలగిస్తుంటాడు. ఈ క్రమంలోనే ఆదివారం సాయంత్రం పొలం చుట్టూ ఉన్న తీగకు విద్యుత్తు సరఫరా చేసేందుకు కొండీలు తగిలిస్తుండగా విద్యుద్ఘాతానికి గురయ్యాడు. పక్కనే ఉన్న అతని బావ సలావుద్దీన్ గుర్తించి గ్రామస్తులకు సమాచారం ఇచ్చి అతన్ని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యంలో జహంగీర్ చనిపోయాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మెదక్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్టు ఎస్ఐ తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.

Tags : Young former, death, electrocution, medak, crop

Advertisement

Next Story

Most Viewed