- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
స్నేహితునికి ఫొన్ చేసిన యువ డాక్టర్.. సెలైన్ పెట్టుకొని చివరకు
దిశ, వెబ్‌డెస్క్ : హైదరబాద్‌లో ఓ యువ డాక్టర్ ఆత్మహత్య కలకలం సృష్టిస్తోంది. సెలైన్‌లో విషం ఎక్కించుకొని యువ డాక్టర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన నగరంలోని ఎస్‌ఆర్‌నగర్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్లితే..రాజు కుమార్ (29) అమీర్ పేటలో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో కార్డియాలజిస్ట్‌గా పనిచేస్తున్నాడు. ఇతను కడప జిల్లా నుంచి వచ్చి బీకేగూడలో అద్దె ఇంట్లో ఒంటరిగా ఉంటున్నాడు. ఈ క్రమంలో రాజు తన ప్రాణ స్నేహితుడైన శ్రీకాంత్‌కు ఫొన్ చేసి చాలా సేపు మాట్లాడాడు. అంతే కాకుండా మనసు బాగలేదు, అంత ఏదోలా అనిపిస్తుంది అంటూ ఫొన్ చేసి చెప్పాడు. కొద్ది సేపటి తర్వాత శ్రీకాంత్‌కు అనుమానం వచ్చి మరోసారి రాజుకు ఫొన్ చేస్తే రాజు లిఫ్ట్ చేయక పోవడంతో తన రూమ్ వద్దకు వెళ్లి చూసేసరికి సెలైన్ పెట్టుకొని పడుకొని ఉన్నాడు. డోర్ పగలగొట్టి అపస్మారక స్థితిలో ఉన్న రాజును ఆసుపత్రికి తీసుకెళ్లారు.అప్పటికే చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. రాజ్ కుమార్ తండ్రి కొడిపల్లి సుబ్బారావు ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన ఎస్ ఆర్ నగర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.