క్షమాపణలు చెప్పిన యోషిరో మోరి

by Shyam |
క్షమాపణలు చెప్పిన యోషిరో మోరి
X

దిశ, స్పోర్ట్స్: టోక్యో ఒలంపిక్స్ నిర్వాహక కమిటీ అధ్యక్షుడు యోషిరో మోరి తన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పారు. కాగా, టోక్యో ఒలంపిక్ కమిటీలో ఉండే సభ్యుల్లో ఆరుగురు ఆడవాళ్లు ఉన్నారని.. వాళ్లు అతిగా మాట్లాడుతుంటారని.. సమయానికి రారు కానీ చాలా అందంగా తయారవుతారంటూ యోషిరో ఇటీవల వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై పలు విమర్శలు వచ్చాయి. యోషిరో వెంటనే తన పదవికి రాజీనామా చేయాలనే డిమాండ్ కూడా వచ్చింది.

దీంతో తప్పు తెలుసుకున్న యోషిరో వెంటనే తన తప్పును తెలుసుకున్నారు. ‘తాను కావాలని ఈ వ్యాఖ్యలు చేయలేదు. ఇప్పటి వరకు నిర్వహణ కమిటి అనేక భేటీలు జరిపింది. కొన్ని సమస్యలు పరిష్కారం కాలేదనే అసహనంతో నోరు జారాను. నన్ను క్షమించండి’ అని యోషిరో చెప్పారు. అయితే తాను కరోనా క్లిష్ట సమయంలో పదవికి రాజీనామా మాత్రం చేయలేనని స్పష్టం చేశారు. యోషిరో మోరీ గతంలో జపాన్‌కు ప్రధానిగా కూడా పని చేశారు. ఆయన గతంలో ఇలా ఎప్పుడూ మాట్లాడలేదని.. అకస్మాత్తుగా నోరు జారడం వల్లే ఆయనపై విమర్శలు వెల్లువెత్తాయని ఒలంపిక్ కమిటీ సభ్యుడు ఒకరు వ్యాఖ్యానించారు.

Advertisement

Next Story