రాధను మోసం చేసిన ఏసు

by srinivas |
రాధను మోసం చేసిన ఏసు
X

దిశ, వెబ్‌డెస్క్: పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం ఎన్నార్పి అగ్రహారంకు చెందిన అమాయకురాలైన రాధను జిత్తులమారి ఏసు మోసం చేశాడు. మాయ మాటలు చెప్పి దుబాయ్‌లో ఉద్యోగం అంటూ నట్టేట ముంచాడు. ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి టూరిస్టు వీసాపై రాధను దుబాయ్‌కి పంపించాడు. ఆ తర్వాత ముఖం చాటేశాడు. ఇదే క్రమంలో రాయబార కార్యాలయంలో చిక్కుకున్న రాధ అక్కడ ఉండలేక.. ఇక్కడికి రాలేక నానా అవస్థలు పడుతోంది. చివరకు ఏజెంట్ ఏసు తనను మోసం చేశాడంటూ అక్కడి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Advertisement

Next Story