Cyclone Yaas :యాస్ తుఫాన్ ఎఫెక్ట్.. తెలంగాణకు వర్ష సూచన

by Shyam |   ( Updated:2021-05-25 21:40:22.0  )
Cyclone Yaas :యాస్ తుఫాన్ ఎఫెక్ట్.. తెలంగాణకు వర్ష సూచన
X

దిశ, వెబ్‌డెస్క్ : యాస్ తుఫాన్ (Cyclone Yaas) ఐదు రాష్ట్రాలపై తీవ్ర ప్రభావం చూపుతుందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించిన విషయం తెలిసిందే. ఈరోజు యాస్ తుఫాన్ బెంగాల్‌లోని ధిఘా వద్ద తీరం దాటనుంది. తుఫాన్ కారణంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

యాస్‌ తుఫాను నేపథ్యంలో కోల్‌కతా ఎయిర్‌పోర్టును అధికారులు మూసివేశారు. బుధవారం ఉదయం 8.30 నుంచి సాయంత్రం 7.45 గంటల వరకు విమానాల రాకపోకలను రద్దు చేసినట్లు విమానాశ్రయ అధికారులు పేర్కొన్నారు. తుఫాను ప్రభావంతో విమాన సర్వీసుల రాకపోకలను రద్దు చేసినందున ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నామని కోల్‌కతా విమానాశ్రయ అధికారులు ట్వీట్ చేశారు. తుఫాన్ నేపథ్యంలో తూర్పు తీర ప్రాంతాల్లో NDRF బృందాలు మోహరించాయి.

అయితే, తుఫాన్ ప్రభావం తెలంగాణపై కూడా పడనుంది. యాస్ కారణంగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో నేడు, రేపు ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది.

Advertisement

Next Story

Most Viewed