యెస్ బ్యాంకు సీనియర్ ఉద్యోగుల వేతనాల్లో మార్పులు!

by Harish |
యెస్ బ్యాంకు సీనియర్ ఉద్యోగుల వేతనాల్లో మార్పులు!
X

దిశ, సెంట్రల్ డెస్క్: కరోనా సంక్షోభం కారణంగా ఇప్పటికే అనేక రంగాల్లో కంపెనీలు వేతన కోతలను విధిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రైవేట్ దిగ్గజ యెస్ బ్యాంకు తమ ఉద్యోగుల జీతాల్లో మార్పులు చేస్తున్నట్టు వెల్లడించింది. సీనియర్ ఉద్యోగులకు ఈ మార్పులు వర్తించనున్నట్టు, వార్షిక వేతనంలో మూడో వంతు వాటా వేరిమబుల్ పేగా మార్చినట్టు స్పష్టం చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సీనియర్ ఉద్యోగులకు 30 శాతం వాటా మార్పులు ఉండనున్నట్టు ప్రకటించింది. కంపెనీ వృద్ధి సాధించిన సమయంలో ఉద్యోగులకు ఇచ్చే మొత్తాన్ని వేరిమబుల్ పేగా పిలుస్తారు. కరోనా సంక్షొభాన్ని కంపెనీ వృద్ధికి అవసరమైన అన్ని రకాల అవకాశాలను వినియోగించుకుంటామని యెస్ బ్యాంక్ తెలిపింది. ఈ పరిణామాలతో బ్యాంకింగ్ రంగంలో రానున్న నూతన ఆవిష్కరణలను అధ్యయనం చేస్తున్నట్టు, ప్రజలకు సులభతర సేవలను అందించేందుకు కొత్త సాంకేతికతను అధ్యయనం చేయనున్నట్టు యెస్ బ్యాంకు ఉన్నతాధికారులు వెల్లడించారు.

Advertisement

Next Story