- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జోరు తగ్గని యెస్‌బ్యాంకు షేరు!
దిశ, వెబ్‌డెస్క్: సంక్షోభంలో కూరుకుపోయిన యెస్ బ్యాంకును ఆదుకోవడానికి దిగ్గజ బ్యాంకులు ముందుకు రావడంతో యెస్ బ్యాంకు షేర్ ధర మార్కెట్లో భారీగా పెరిగింది. సోమవారం సెన్సెక్స్‌లో యెస్ బ్యాంక్ షేర్ 53 శాతం పెరిగింది. యెస్ బ్యాంకు నిరర్ధక ఆస్తుల్లో మునిగిపోకుండా ప్రభుత్వ రంగ బ్యాంకు ఎస్‌బీఐ సహా మరో ఏడు బ్యాంకులు యెస్ బ్యాంకులో పెట్టుబడులు పెట్టాయి. ఈ పరిణామాలతో యెస్ బ్యాంకు జోరు కొనసాగింది. యెస్ బ్యాంకులో వాటాలు కొనే ప్రణాళికకు కేంద్ర ఆమోదించింది. దీంతో మార్కెట్ ఓపెన్ అయిన దగ్గరనుంచి యెస్ బ్యాంకు షేర్ కొనేందుకు మదుపర్లు అమితాసక్తి చూపించారు. దీంతో యెస్ బ్యాంకు షేర్ భారీగా పెరిగింది. ఒక దశలో 58 శాతంతో రూ. 40.32 వరకూ ఇట్రాడే గరిష్ఠాన్ని తాకింది. మార్కెట్ ముగిసే సమయానికి యెస్ బ్యాంకు షేర్ ధర 45.01 శాతం పెరిగి రూ. 37.05 వద్ద ఉంది.
యెస్ బ్యాంకులో ఎస్‌బీఐ అత్యధిక పెట్టుబడి పెట్టగా, హెచ్‌డీఎఫ్‌సీ రూ. వెయ్యి కోట్లు, ఐసిఐసిఐ రూ. వెయ్యి కోట్లు, యాక్సిస్ బ్యాంకు రూ. 600 కోట్లు, కోటక్ బ్యాంక్ రూ. 500 కోట్లు, ఫెడరల్ బ్యాంక్ రూ. 300 కోట్లు, ఐడీఎఫ్‌సీ బ్యాంకు రూ. 300 కోట్లు, బంధన్ బ్యాంకు రూ. 300 కోట్ల పెట్టుబడులు పెట్టాయి.
tags : Yes Bank Shares, SBI, Shares, Kotak Securities, Axis Bank