ప్రతిపక్షంలో ఉండి ప్రశ్నిస్తా : వైసీపీ ఎమ్మెల్యే

by srinivas |   ( Updated:18 March 2021 5:16 AM  )
YCP MLA Kasu Mahesh Reddy
X

దిశ, గుంటూరు: వైసీపీ ఎమ్మెల్యే కాసు మహేశ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం పిడుగురాళ్ళ పురపాలక సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారానికి హాజరైన ఆయన, నూతన కార్యవర్గాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ… ‘‘ప్రజల గొంతుకగా ప్రతిపక్షంలో నేనుండి ప్రశ్నిస్తా.. ఏకగ్రీవమయ్యాం అడగడానికి ప్రతిపక్షం లేదని పట్టణ ప్రజలను నిర్లక్ష్యం చేస్తే జనం పక్షాన మిమ్మల్ని నేను నిలదీస్తా’’ అని కాసు తనదైన శైలిలో ప్రజల తరపున కౌన్సిలర్లకు ఓ స్వీట్ వార్నింగ్ ఇచ్చారు.

అంతేగాకుండా.. ‘‘అవసరమైతే పదవి నుంచి తొలగించడానికి కూడా ఆలోచించను. పిడుగురాళ్ళ పట్టణాన్ని అభివృద్ధి బాటలో నడిపించే విధంగా 33మంది కౌన్సిలర్లు కృషి చేయాలి. ఓర్పు సహనంతో ప్రజల సమస్యలు విని పరిష్కరించాలి. రోజూ వార్డులను సందర్శించి ప్రజలకు దగ్గరగా ఉండాలి. గత పాలకుల అసమర్థ పాలనతో పిడుగురాళ్ళ పట్టణంలో ‘ఎక్కడ వేసిన గొంగళి అక్కడే’ అనే చందంగా ఉంది. మున్సిపల్ నిధులను సరైన రీతిలో వినియోగించుకొని పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్ది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆశయాలకు బావుటగా నిలుద్దాం.’ అని కాసు మహేష్ రెడ్డి తెలియజేశారు.

👉 Download our Android App
👉Download our IOS App
👉Follow us on Instagram
👉 Follow us on whatsApp channel
👉 Follow us on Share chat

Next Story

Most Viewed