- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఆనందయ్య అరెస్టుపై వైసీపీ ఎమ్మెల్యే క్లారిటీ
దిశ, వెబ్‌డెస్క్: నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో ఆనందయ్య ఇస్తున్న ఆయుర్వేద కరోనా ముందుకు మరోసారి బ్రేక్ పడింది. దీంతో అర్ధరాత్రి పోలీసులు ఆనందయ్య ఇంటికి చేరుకొని ఆయన్ను అరెస్ట్ చేసి, కృష్ణపట్నం నుంచి తరలించినట్టు సోషల్ మీడియాలో వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. ఈ వార్తలపై సర్వేపల్లి వైసీపీ ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి స్పందించారు. ఈ మేరకు శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు. ‘‘కృష్ణపట్నంలో ఆయుర్వేద మందు తయారు చేస్తున్న వైద్యుడు ఆనందయ్యను పోలీసులు అరెస్టు చేసినట్లు సోషల్ మీడియాలో వస్తున్న పోస్టులు అవాస్తవం, కేవలం వదంతులు మాత్రమే, దయచేసి ఎవరూ ఇటువంటి పుకార్లను నమ్మవద్దని మనవి.’’ ప్రకటనలో పేర్కొన్నారు. కాగా, ఆనందయ్య ఇంటికి భారీగా కరోనా బాధితులు వస్తుండటంతో.. ఇవాళ్టి నుంచి ప్రభుత్వం అనుమతి వచ్చే వరకు మందు పంపిణీ లేదని, మందు కోసం ఎవరూ రావద్దని పోలీసులు విజ్ఞప్తి చేశారు.