వారి కన్నీళ్లు తుడవడం వైఫల్యమా..

by srinivas |   ( Updated:2020-11-07 08:08:00.0  )
వారి కన్నీళ్లు తుడవడం వైఫల్యమా..
X

దిశ, విశాఖపట్నం: ప్రతిపక్షనేత చంద్రబాబు తన పాలనలో పేదల ఇంటి నిర్మాణాల కోసం ఏనాడైనా ఒక్క సెంటు భూమిని ఇచ్చారా అంటూ మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు మండిపడ్డారు. శనివారం శ్రీకాకుళంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వం పేదల ప్రభుత్వమని, అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అమలు చేస్తుందన్నారు.

రాష్ట్రంలోని ఒక్క శ్రీకాకుళం జిల్లాలోనే రూ.100 కోట్లతో పేదల ఇంటి స్థలాల కోసం భూములు కొనుగోలు చేశారని, పేదలకు భూములు పంచితే ఎక్కడ తమ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందోనని కోర్టులో కేసులు వేయించారని విమర్శించారు. పాదయాత్రలో ఇచ్చిన హామీల ప్రకారం పేదవాడి కంటినీరు తుడవడం ప్రభుత్వ వైఫల్యమా? అంటూ ప్రశ్నించారు. ప్రజాసంకల్ప యాత్ర తరువాత వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎటువంటి మార్పులు జరిగాయో తెలుసుకునేందుకే పాదయాత్రలు నిర్వహిస్తున్నామని ధర్మాన అన్నారు. ఇప్పటికైనా చంద్రబాబు తన తీరు మార్చుకోవాలని ప్రభుత్వం చేపట్టే మంచి పనులు అభినందించాలన్నారు.

Advertisement

Next Story