చంద్రబాబు ప్రెస్‌మీట్లన్నీ కామెడీ షోలే..

by srinivas |
చంద్రబాబు ప్రెస్‌మీట్లన్నీ కామెడీ షోలే..
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడి ప్రెస్‌‌మీట్లన్నీ కామెడీ షోలుగా తయారయ్యాయని ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి విమర్శించారు. మమ్మల్ని రాజీనామా చేయాలని కోరే అర్హత చంద్రబాబుకు లేదని ఆయన ఎద్దేవా చేశారు. చంద్రబాబుకు దమ్ము, ధైర్యముంటే ఉత్తరాంధ్ర, రాయలసీమ కొచ్చి మాట్లాడాలి అని ప్రశ్నించారు.

చంద్రబాబు ఉన్మాదిలా వ్యవహరిస్తున్నారని ఎద్దేవా చేశారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్, హైకోర్టుపై చంద్రబాబు స్టాండ్ చెప్పాలని ప్రశ్నించారు. దానికి చంద్రబాబుకు 48 గంటల సమయం ఇస్తున్నామని స్పష్టం చేశారు. అంతేగాకుండా బయటకొచ్చి రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు తన ఎమ్మెల్యేలతో రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్తే.. ఎదుర్కొవడానికి వైసీపీ సిద్ధంగా ఉందని తెలిపారు.

Advertisement

Next Story