- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘ప్రభుత్వం ఎప్పుడూ ఎన్నికల వాయిదా కోరలేదు’
దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికలకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌సు సుప్రీంకోర్టు కొట్టి వేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ సంఘాలు దాఖలు చేసిన పిటిషన్లను తోసిపుచ్చిన సుప్రీంకోర్టు ధర్మాసనం. ఎన్నికలు రాజ్యాంగ ప్రక్రియలో భాగమని తెలిపింది. తాజాగా దీనిపై వైసీపీ అధికార ప్రతినిధి రవిచంద్రారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… ప్రభుత్వం ఎప్పుడూ ఎన్నికలు వాయిదా వేయాలని కోరలేదని అన్నారు. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఎన్నికలను వాయిదా వేయాలని కోరామని తెలిపారు. అంతేగాకుండా సుప్రీంకోర్టు తీర్పు ఏపీ ఉద్యోగులకు అనుకూలంగా రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వానికి ప్రజల ప్రాణాలను కాపాడే బాధ్యత ఉందని గుర్తుచేశారు.