వైసీపీ నేత ఎంఏ రహమాన్ గుండెపోటుతో మృతి

by Shyam |
వైసీపీ నేత ఎంఏ రహమాన్ గుండెపోటుతో మృతి
X

దిశ ప్రతినిధి , హైదరాబాద్ : మాజీ ఎమ్మెల్సీ , వైఎస్ఆర్ సీపీ ప్రధాన కార్యదర్శి ఎంఏ రహమాన్ గుండెపోటుతో హఠాన్మరణం పొందారు. గన్ ఫౌండ్రి డివిజన్ న్యాజ్ ఖాన లో నివాసముంటున్న ఆయన శుక్రవారం నమాజ్ అనంతరం ఇంట్లోనే గుండె పోటు రావడంతో మృతి చెందారు. తెలంగాణ సీఎం కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ స్థాపించిన సమయంలో ఆయనతో పాటు నడవడమే కాకుండా ఆయనకు అత్యంత సన్నిహితులలో ఒకరిగా గుర్తింపు పొందారు.

అనంతరం ఆయన వైఎస్ఆర్ సీపీలో చేరారు. ఇదిలా ఉండగా 2012 లో జరిగిన ఉప ఎన్నికలలో పార్టీ అభ్యర్థులు ఘన విజయం సాధించడంతో సంతోషం వ్యక్తం చేస్తూ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సంబరాలలో పాల్గొన్న రహమాన్ గాలి లోకి తన వద్ద గన్ తో కాల్పులు జరపడం తో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ సంఘటనలో ఆయనకు న్యాయస్థానం రూ 5 వేల జరిమానా, జైలు శిక్షవిధించడంతో ఒక్క సారిగా ఆయన కు రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు దక్కింది. ఇదిలా ఉండగా ఎంఏ రహమాన్ గుండె పోటుతో అకాల మరణం పొందడం పట్ల పలువురు వైఎస్ఆర్ సీపీ నాయకులు,కార్యకర్తలు సంతాపం వ్యక్తం చేశారు .

Advertisement

Next Story

Most Viewed