- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఓటేసుకో.. సెల్ఫీ తీసుకో.. పోలింగ్ కేంద్రంలో ఆ పార్టీదే హవా!
దిశ, వెబ్‌డెస్క్ : ఏపీలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు పోలింగ్ జరుగుతున్న విషయం తెలిసిందే. అన్ని కేంద్రాల్లో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం 7గంటలకు పోలింగ్ ప్రారంభమవ్వగా సాయంత్రం 5గంటలకు ముగియనుంది. అయితే, 5గంటల వరకు క్యూలైన్‌లో ఉన్నవారికి ఓటు వేసే అవకాశం ఇవ్వనున్నట్లు అధికారులు తెలిపారు.
ఈ నేపథ్యంలోనే చిత్తూరు జిల్లా గుర్రంకొండ పోలింగ్ బూత్‌లో సెల్ఫీఫొటోలు కలకలం రేపాయి. ఓటు వేసేందుకు వచ్చిన వైసీపీ కార్యకర్తలు పోలింగ్ కేంద్రంలోనే సెల్ఫీ ఫొటోలు తీసుకున్నట్లు సమాచారం.అంతేకాకుండా ఓటు మీకే వేశామంటూ అభ్యర్థికి సమాచారం అందించినట్లు తెలుస్తోంది. ఆపై ఆ వీడియోలను కొందరు వైసీపీ కార్యకర్తలు సోషల్ మీడియాలో పోస్టు చేశారు. పోలింగ్ సమయంలో ఓటర్లు మొబైల్ ఫోన్లను లోపలికి తీసుకెళ్లినా పోలీసులు పట్టించుకోవడం లేదని ఆరోపణలు వస్తున్నాయి. అధికార పార్టీ నేతల అండదండలు చూసుకునే వైసీపీ కార్యకర్తలు ఇలా చెలరేగి పోతున్నాయని, వారిపై ఎటువంటి చర్యలు తీసుకుంటారో చెప్పాలని రాష్ట్ర పోలీసు యంత్రాంగాన్ని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఇదిలాఉండగా, మధ్యాహ్నం మూడు గంటల వరకు పరిషత్ ఎన్నికల్లో 47శాతం పోలింగ్ నమోదైందని సమాచారం.