బాబు, లోకేష్‌పై డీజీపీకి వైసీపీ ఫిర్యాదు

by srinivas |   ( Updated:2021-04-09 03:27:52.0  )
బాబు, లోకేష్‌పై డీజీపీకి వైసీపీ ఫిర్యాదు
X

దిశ, వెబ్‌డెస్క్: టీడీపీ అధినేత చంద్రబాబు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌పై డీజీపీ గౌతమ్ సవాంగ్‌కి అధికార వైసీపీ ఫిర్యాదు చేసింది. తిరుపతి వైసీపీ ఎంపీ అభ్యర్థి డాక్టర్ గురుమూర్తిని కించపరుస్తూ సోషల్ మీడియాలో టీడీపీ పోస్టులు పెట్టడంపై చర్యలు తీసుకోవాలని వైసీపీ కోరింది.

చంద్రబాబు, లోకేష్ పై ఎస్సి, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాలని వైసీపీ నేతలు కోరారు. ఫిర్యాదును పరిశీలించి చర్యలు తీసుకుంటామని డీజీపీ చెప్పారు.

Advertisement

Next Story