- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
HYDRA: హైడ్రా ప్రధాన లక్ష్యం అదే.. కమిషనర్ ఏవీ రంగనాథ్ కీలక వ్యాఖ్యలు
దిశ, వెబ్ డెస్క్: నీటి వనరుల సంరక్షణ మరియు పర్యావరణ సమతుల్యత హైడ్రా(Hydra) ప్రధాన లక్ష్యమని(Main Aim) హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్(Hydra Commisioner AV Ranganath) స్పష్టం చేశారు. హైదరాబాద్ లో నేషనల్ ఇన్విరాన్ మెంటల్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్(National Environmental Engineering Research Institute)(NEERI) ఆధ్వర్యంలో బ్రెయిన్‌స్ట్రోమ్ సెషన్ ఆన్ ఆర్బన్ లేక్ మేనేజ్‌మెంట్(Brainstorm Session On Urban Lake Management) పై వర్క్‌షాప్(Workshop) నిర్వహించారు. ఇందులో హైడ్రా తరుపున కమిషనర్ ఏవీ రంగనాథ్ పాల్కొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావడం ఆనందంగా ఉందన్నారు. అలాగే తెలంగాణ పట్టణీకరణ(Urbanization) చెందుతున్న రాష్ట్రం అని, ఇప్పటికే 48 శాతం జనాభా పట్టణీకరణ చెందిందని తెలిపారు. ఇలాగే కొనసాగితే 2050 నాటికి దాదాపు 75 నుంచి 80 శాతం అర్బనైజ్ అయ్యే అవకాశం ఉందని, అందుకే హైదరాబాద్ లోని చెరువులను కాపాడాల్సి బాధ్యత ఎంతైనా ఉందని చెప్పారు. చెరువుల పరిసరాలను తనిఖీ చేసి నీటి వనరుల సంరక్షించడం, పర్యావరణ సమతుల్యతను కాపాడటం కోసమే ప్రభుత్వం హైడ్రాను ఒక ఏజెన్సీగా తీసుకొచ్చిందని స్పష్టం చేశారు. ఇందులో భాగంగానే ఈ కార్యక్రమంలో పాల్గొని నిపుణుల సలహాలు, సూచనలు తీసుకోవడం జరిగిందని రంగనాథ్ తెలిపారు.