గాయ్స్.. లెట్స్ ‘పావ్రీ’

by Sujitha Rachapalli |
గాయ్స్.. లెట్స్ ‘పావ్రీ’
X

దిశ, ఫీచర్స్ : పాకిస్థాన్, ఇస్లామాబాద్‌కు చెందిన ఇన్‌ఫ్లుయెన్సర్, కంటెంట్ క్రియేటర్ అయిన ‘దాననీర్’ వీడియో ఒకటి నెట్టింట్లో ట్రెండింగ్‌లో ఉంది. ఆమె చేసిన వీడియోతో హ్యాష్‌ట్యాగ్ ‘పావ్రి హో రాహి హై’‌ సోషల్ మీడియాలో దూసుకుపోతుండగా, అందుకు సంబంధించిన మీమ్స్ వైరల్‌గా మారాయి. తాజాగా ముంబై మ్యూజిక్ కంపోజర్, ఇండియన్ రీమిక్సర్, ‘రసోద్ మే కౌన్ థా’ ఫేమ్.. యశ్‌రాజ్ ముఖర్జీ ఈ వైరల్ ట్రెండ్‌పై మరో పెప్పీ నెంబర్ అందించాడు. ఈ నేపథ్యంలో అసలు పావ్రీ గర్ల్ మీమ్ ఏంటో తెలుసుకుందాం.

పెషావర్ గర్ల్ దాననీర్.. ఇన్‌స్టాగ్రామ్‌ ఇన్‌ఫ్లుయెన్సర్‌గా గుర్తింపు పొందింది. ఈ క్రమంలో ఔట్‌ఫిట్స్, స్కిన్ కేర్, మేకప్ టిప్స్ అందించడంతో పాటు ఫొటోషూట్స్, వ్లాగ్స్‌తో సోషల్ మీడియాలో ఆమె ఫాలోయింగ్ అంతకంతకూ పెరిగింది. ప్రస్తుతం దానవీర్‌కు 274కె ఫాలోవర్స్ ఉండగా.. ఈ వారం ప్రారంభంలో తన ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్‌లో ఓ వీడియో షేర్ చేసింది. దాంట్లో ‘యే హమారా కార్ హై.. యే హమారా పావ్రి హో రాహి హై’ అంటూ ఆమె చెప్పగా, ఆ వీడియోకు ‘బర్గర్స్.. నార్తర్న్ ప్రాంతాలను సందర్శించినప్పుడు.. యే హమారి పావ్రి హొరై హై’ అంటారని, ఇది గోల్డ్ కంటెంట్ అని, పదికి పది శాతం మీమర్స్ కంటెంట్’ అనే ట్యాగ్‌ను జత చేసింది. ఆమె చెప్పినట్లుగానే ఈ వీడియో 1.5 మిలియన్ వీక్షణలతో దూసుకుపోవడమే కాకుండా, సోషల్ మీడియా స్టార్మ్‌‌గా నిలిచింది. ఆ వీడియో ఆధారంగా ఎన్నో స్పూఫ్స్, మరెన్నో రీక్రియేషన్స్‌తో పాటు మీమర్స్ కూడా పండుగ చేసుకుంటున్నారు. ఇందులో ‘బర్గర్ బచ్చాస్’ అంటే పాశ్చాత్య సంస్కృతి, పద్ధతులు, అలవాట్లతో పాటు స్వరాలను అనుకరించటానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్న ఒక ఉన్నత తరగతి పాకిస్తాన్ ప్రజల కోసం ఉపయోగించే ట్యాగ్. ఎందుకంటే వీళ్ల మదర్ టంగ్ ఉర్దూ అయినా, వాళ్లు తమ మాతృభాషలో మాట్లాడానికి సిగ్గు పడతారు.

ఈ వీడియో దేశ సరిహద్దులు దాటి ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటుండగా, యశ్ రాజ్ ముఖర్జీ కూడా ‘# పావ్రిహోరాహిహై’ అంటూ మరో ఉల్లాసమైన ర్యాప్‌తో తిరిగొచ్చాడు. ఇది మా కారు, ఇది మేము, ఇక్కడ మా పార్టీ జరుగుతోంది అనే లైన్లతో సాగిన పాట నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఇక తన యూనిక్ ‘పావ్రిహోరాహిహై’ మ్యూజిక్ నెంబర్‌ను పోస్ట్ చేస్తూ ‘ఈ రోజు నుండి నేను పార్టీ చేయను, నేను పావ్రి చేస్తాను, పార్టీ కంటే పావ్రిలో చాలా సరదాగా ఉంటుంది’ అని రాసుకొచ్చాడు. సో గాయ్స్ లెట్స్ పావ్రీ.

Advertisement

Next Story

Most Viewed