యశ్ నెక్స్ట్ ప్రాజెక్ట్‌పై ఆసక్తికర చర్చ.. యంగ్ డైరెక్టర్‌కే ఛాన్స్

by Shyam |   ( Updated:2021-06-17 01:58:44.0  )
యశ్ నెక్స్ట్ ప్రాజెక్ట్‌పై ఆసక్తికర చర్చ.. యంగ్ డైరెక్టర్‌కే ఛాన్స్
X

దిశ, సినిమా : కన్నడ హీరో యశ్ ‘కేజీఎఫ్’ సినిమాతో పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లో వచ్చిన ఈ ఒక్క సినిమా తన కెరియర్ టర్నింగ్ పాయింట్‌గా నిలవగా.. నేషనల్ వైడ్ ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది. దీంతో ‘కేజీఎఫ్ 2’ సినిమాను భారీ అంచనాల నడుమ తెరకెక్కించారు. హోంబలె ఫిల్మ్స్ బ్యానర్‌పై తెరకెక్కిన సినిమా టీజర్ ఇప్పటికే విడుదలై రికార్డుల సునామీ సృష్టించింది. ఈ టీజర్‌లో పవర్ ప్యాక్డ్ పర్ఫార్మెన్స్‌తో అదరగొట్టిన యశ్ నెక్స్ట్ ప్రాజెక్ట్‌ ఏంటనే విషయంపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతూనే ఉంది.

ఈ క్రమంలో యంగ్ కన్నడ డైరెక్టర్ నర్తన్‌తో పాన్ ఇండియా ప్రాజెక్ట్ చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రశాంత్ నీల్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన నర్తన్.. 2017లో మఫ్టీ సినిమాతో డైరెక్టర్‌గా ఎంట్రీ ఇచ్చి సక్సెస్ అందుకున్నాడు. ప్రస్తుతం ఈ టాలెంటెడ్ డైరెక్టర్ యశ్ కోసం యూనివర్సల్ కాన్సెప్ట్‌ రెడీ చేశాడని.. ఇందులో రాకీ భాయ్ పవర్‌ఫుల్ నేవీ ఆఫీసర్ రోల్ ప్లే చేయబోతున్నాడని సమాచారం. కాగా ఈ బిగ్ బడ్జెట్ మూవీపై త్వరలో అఫిషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చే అవకాశం ఉంది.

Advertisement

Next Story