- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పండుగ సీజన్‌లో అమ్మకాలకు ఢోకాలేదు..
దిశ, వెబ్‌డెస్క్: గత మూడు నెలల్లో అమ్మకాల వృద్ధి సానుకూలంగా నమోదవుతున్న తరుణంలో పండుగ సీజన్ సమయానికి అమ్మకాలు మరింత బలంగా ఉంటాయని ద్విచక్ర వాహన తయారీ సంస్థ యమహా మోటార్ ఇండియా (Yamaha motar india) మంగళవారం వెల్లడించింది. సెప్టెంబర్‌లో కంపెనీ అమ్మకాలు 17 శాతం పెరిగి 63,052 యూనిట్లకు చేరుకుందని, గతేడాది ఇదే నెలలో 53,727 యూనిట్లుగా నమోదైనట్టు కంపెనీ తెలిపింది.
అలాగే, జులైలో కూడా 4.3 శాతం వృద్ధితో 49,989 యూనిట్లను విక్రయించినట్టు కంపెనీ పేర్కొంది. ఆగష్టులో కంపెనీ అమ్మకాలు గతేడాది రూ. 52,706 యూనిట్ల అమ్మకాలతో పోలిస్తే 14.8 శాతం పెరిగి రూ. 60,505 యూనిట్లకు చేరుకున్నట్టు తెలిపింది. పండుగ సీజన్ (Festival session) అమ్మకాలు ఇప్పటివరకు ఉన్నదానికంటే మెరుగ్గా ఉంటాయని కంపెనీ ఆశాభావం వ్యక్తం చేసింది.
అక్టోబర్ నెలలో సెప్టెంబర్ కంటే మెరుగైన ఫలితాలను ఆశిస్తున్నట్టు యమహా మోటార్ ఇండియా ఒక ప్రకటనలో వెల్లడించింది. ప్రస్తుత పరిస్థితులను అంచనా వేస్తూ, కస్టమర్లను ఆకట్టుకునేందుకు, వినియోగదారులకు మరింత నిర్దిష్టమైన సేవలందించేందుకు పండుగ సీజన్‌లో మార్కెట్లోకి కొత్త 125సిసి స్కూటర్లకు ఆకర్షణీయమైన ఫైనాన్స్ పథకాలను అందించనున్నట్టు కంపెనీ తెలిపింది. ప్రస్తుతం యమహా నుంచి 125సిసి రేంజ్ స్కూటర్లలో ఫాసినో, రే జెడ్ఆర్, రే జెడ్ఆర్ స్ట్రీట్ ఉన్నాయి.