- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఈనెల 8 నుంచి యాదాద్రిలో భక్తులకు అనుమతి
దిశ, నల్లగొండ: యాదాద్రి నరసింహుడి దర్శనానికి ఈ నెల 8 నుంచి భక్తులకు అనుమతినిస్తున్నట్లు యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ అనితారామచంద్రన్ తెలిపారు. ఆలయ పున: ప్రారంభ అంశంపై శనివారం డీసీపీ నారాయణరెడ్డి, ఆలయ ఈఓ గీతారెడ్డి, అదనపు కలెక్టర్ భీమ్యానాయక్‌లతో కలెక్టర్ సమావేశమై చర్చించారు. భక్తులందరూ భౌతిక దూరం పాటించేలా క్యూలైన్లలో తగిన ఏర్పాట్లు చేయాలని, మాస్కులు తప్పనిసరిగా ధరించేలా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రవేశ ద్వారం వద్ద శానిటైజర్లు ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రతి ఒక్కరికీ థర్మల్ స్క్రీనింగ్ చేశాకే ఆలయంలోకి అనుమతించాలని కలెక్టర్ స్పష్టం చేశారు. యాదాద్రిలో ప్రత్యేకంగా ఐసోలేషన్ వార్డు, ఫీవర్ వార్డులను ఏర్పాటు చేసి వైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. సమావేశంలో శిక్షణ సహాయ కలెక్టర్ గరిమా అగర్వాల్, ఆర్డీఓ భూపాల్ రెడ్డి, తహసీల్దార్ అశోక్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ రజిత పాల్గొన్నారు.