ఎక్స్‌రేతో కరోనా టెస్ట్..!

by Anukaran |
ఎక్స్‌రేతో కరోనా టెస్ట్..!
X

దిశ, వెబ్‌డెస్క్

రోజురోజుకు కరోనా విలయతాండవం చేస్తోంది. ప్రజలు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా వైరస్ బారినపడుతున్నారు. పదుల నుంచి వందలు, వేల సంఖ్యలో కేసులు పెరుగుతుండడంతో వారందరికి టెస్ట్ లు చేయడం వైద్యులకు సవాలుగా మారింది. ఏమాత్రం లక్షణాలు కనిపించినా జనం ఆస్పత్రుల ఎదుట క్యూ కడుతున్నారు. దీంతో కరోనా బారినపడిన వారికి కూడా నిర్ధారణ పరీక్షలు ఆలస్యం అవుతున్నాయి. టెస్టుల కోసం ఒక్కొక్కరు రోజుల తరబడి నిరీక్షించాల్సి వస్తోంది.

అయితే కరోనా ఫలితాలను అతి తక్కువ సమయంలో తెలసుకోవచ్చని గాంధీనగర్ ఐఐటీ విద్యార్థులు పేర్కొంటున్నారు. తాము కనుగొన్న కొత్త టెక్నాలజీతో కరోనా పరీక్షా ఫలితాలను త్వరగా తెలుసుకోవచ్చని నిరూపిస్తున్నారు. కేవలం మనిషి శరీర భాగాన్ని ఎక్స్‌రే తీయడం ద్వారా కరోనాను గుర్తించవచ్చని వివరిస్తున్నారు.

కరోనా పరీక్షల నిర్థారణ కోసం ‘డీప్‌ లెర్నింగ్‌ టూల్‌’ యంత్రాన్ని తయారు చేసినట్లు ఐఐటీ విద్యార్థులు పేర్కొంటున్నారు. దీని ద్వారా మనిషి చాతీ భాగంలో ఎక్స్‌రే తీసి, దాన్ని కంప్యూటర్‌ ఆధారంగా పరిశీలిస్తే కొవిడ్‌ నియంత్రణకు అవకాశం ఉంటుందంటున్నారు. మెదడులోని నాడి వ్యవస్థ ఆధారంగా కంప్యూటర్‌ ప్రోగ్రామ్‌ ఒకదానిని రూపొందించామని రీసెర్చ్ టీం మెంబర్, ఎంటెక్‌ విద్యార్థి కుష్‌పాల్‌ సింగ్‌ యాదవ్‌ తెలిపారు. దీనిని అందుబాటులోకి తేస్తే ప్రజందరికీ ఉపయోగడుతుందని ఐఐటీ విద్యార్థులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed