- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘టీమ్ ఇండియాతో పోరు సవాలే’
దిశ, స్పోర్ట్స్ : టీమ్ ఇండియాతో క్రికెట్ పోరు ఎప్పుడూ సవాలే అని న్యూజీలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్‌సన్ అన్నాడు. జూన్18 నుంచి 22 వరకు ఐసీసీ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో ఇండియాతో ఆడటానికి తాను ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నానని కేన్ అన్నాడు. ఇటీవల కాలంలో టెస్టు మ్యాచ్‌లకు మరింత ఆదరణ పెరిగిందని.. దీనికి కారణం వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్‌ను ప్రవేవపెట్టడమే అని కేన్ అభిప్రాయపడ్డాడు.
మరో నెల రోజుల్లో ఐసీసీ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్ జరుగనుండటంతో ఐసీసీ చేసిన ప్రత్యేక ఇంటర్వ్యూలో కేన్ మాట్లాడాడు. ‘డబ్ల్యూటీసీ వల్ల సుదీర్ఘ ఫార్మాట్‌పై అభిమానుల్లో ఆసక్తి పెరిగింది. ఇండియా-ఆస్ట్రేలియా, న్యూజిలాండ్-పాకిస్తాన్ మధ్య హోరాహోరీ మ్యాచ్‌లు జరిగాయి. ప్రతీ ఒక్కరు డ్రా కోసం కాకుండా ఫలితం కోసం శ్రమించారు.’ అని విలియమ్‌సన్ అన్నాడు. ఐసీసీ టెస్ట్ చాంపియన్‌షిప్ టైటిల్ గెలవడం కోసం చాలా శ్రమిస్తున్నాము. తొలి టైటిల్ గెలవడం ఎప్పుడూ ప్రత్యేకమే అని విలియమ్‌సన్ అన్నాడు.