శ్రేయాస్ ఈటీలో ‘రాంగ్ గోపాల్’

by Shyam |
శ్రేయాస్ ఈటీలో ‘రాంగ్ గోపాల్’
X

దిశ, వెబ్‌డెస్క్: కమెడియన్ షకలక శంకర్ రామ్ గోపాల్ వర్మ పాత్రలో కనిపించబోతున్న చిత్రం ‘రాంగ్ గోపాల్’. ఏ రైట్ డైరెక్టర్ ఇన్ ద రాంగ్ డైరెక్షన్ అనేది క్యాప్షన్. క్రియేటివ్ సినిమాలు తీసి బెస్ట్ డైరెక్టర్ అనిపించుకున్న వర్మ.. ఈ మధ్య అన్నీ వివాదాస్పద చిత్రాలు తీస్తుండటం.. ముఖ్యంగా సినీ ఇండస్ట్రీ ప్రముఖులను టార్గెట్ చేస్తూ సినిమాలు చేయడంపై ఫైర్ అవుతూ సీనియర్ జర్నలిస్ట్ ప్రభు ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. కాగా ఈ చిత్రాన్ని శ్రేయాస్ ఈటీ ద్వారా రిలీజ్ చేయబోతున్నారు ఫిల్మ్ మేకర్స్.

బోల్డ్ కంటెంట్‌తో సినిమాలు చేస్తున్న వర్మను విమర్శిస్తూ డైరెక్టర్ ఈ మూవీని రూపొందించగా.. డేర్ ఆర్ డై క్రియేషన్స్ బ్యానర్ నిర్మిస్తున్న సినిమాలో కత్తి మహేష్, అభి ప్రధాన పాత్రల్లో కనిపించబోతున్నారని తెలుస్తోంది.

Advertisement

Next Story