మరోసారి పెరిగిన హోల్‌సేల్ ద్రవ్యోల్బణం.. ఎంతంటే ?

by Harish |
Inflation
X

దిశ, వెబ్‌డెస్క్: టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణ వరుసగా ఐదవ నెలలో కూడా రెండంకెలపైనే నమోదైంది. ప్రస్తుత ఏడాది ఆగష్టు నెలకు సంబంధించి హోల్‌సేల్(డబ్ల్యూపీఐ) ద్రవ్యోల్బణం 11.39 శాతానికి చేరుకున్నట్టు వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ మంగళవారం వెల్లడించింది. గతేడాది ఆగష్ట్ లో ఇది 0.41 శాతంగా ఉంది. ఈ ఏడాది జూలైతో పోలిస్తే 0.23 శాతం ఎక్కువ. జూలైలో 11.16 శాతంగా నమోదైన సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఆహారేతర వస్తువులు, మినరల్ ఆయిల్ ధరలు పెరగడమే దీనికి కారణమని మంత్రిత్వ శాఖ అభిప్రాయపడింది. అంతేకాకుండా ముడిచమురు, సహజవాయువు, తయారీ వస్తువుల ధరలు కూడా పెరిగాయని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.

ఉల్లి ధరలు, పప్పు ధాన్యాల ధరలు పెరిగినప్పటికీ, ఆహార ఉత్పత్తుల ద్రవ్యోల్బణం వరుసగా నాలుగో నెలలోనూ తగ్గింది. ఆగష్టులో ఆహార ద్రవ్యోల్బణం 1.29 శాతంగా నమోదైంది. జూలైలో సున్నాగా ఉంది. హోల్‌సేల్‌లో ఉల్లి ధరలు 62.78 శాతం, పప్పు ధాన్యాల ధరలు 9.41 శాతం పెరగ్గా, కూరగాయలు 13.30 శాతం తగ్గాయని గణాంకాలు వివరించాయి. ముడి పెట్రోలియం ద్రవ్యోల్బణం 40.03 శాతం, తయారీ వస్తువుల టోకు ద్రవ్యోల్బణం 11.39 శాతంగా నమోదైనట్టు మంత్రిత్వ శాఖ గణాంకాలు వెల్లడించాయి.

Advertisement

Next Story

Most Viewed