- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
దిశ, ఫీచర్స్ : సౌదియా ఎయిర్‌లైన్స్ ఇంటర్నేషనల్ ట్రావెలర్స్‌కు శుభవార్త అందించింది. ప్రపంచంలోనే తొలి ఫ్లయింగ్ మ్యూజియమ్‌ను లాంచ్ చేసినట్లు ప్రకటించింది. ఈ మేరకు నవంబర్ 4న రియాద్ నుంచి అల్ ఉలాకు ప్రయాణించిన వారు ఫస్ట్ టైమ్ ‘ఆకాశంలో మ్యూజియమ్’ ఎక్స్‌పీరియన్స్‌ను పొందడం విశేషం. ‘స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ మ్యూజియమ్’ అనేది అల్ ఉలా రాయల్ కమిషన్, నేషనల్ ఫ్లాగ్ క్యారియర్ ‘సౌదియా’ల కొలాబరేటింగ్ ప్రాజెక్ట్ కాగా.. పురావస్తు తవ్వకాల్లో ‘అల్ ఉలా’లో కనుగొనబడిన కళాఖండాలను ఈ ఫ్లయింగ్ మ్యూజియమ్‌లో ప్రదర్శిస్తున్నారు.
అల్ ఉలా నగరం సౌదీ అరేబియా వాయువ్య ప్రాంతంలోని మదీనా ప్రాంతానికి చెందినది. ఆ దేశంలో UNESCO గుర్తించిన మొట్టమొదటి ప్రపంచ వారసత్వ ప్రదేశమైన హెగ్రాకు నిలయం. అందమైన మట్టి-ఇటుకలు, రాతి గృహాలు కలిగిన ఈ ఆరవ శతాబ్దపు నగరం ‘ఉలా గవర్నరేట్’ పరిధిలోకి వస్తుండగా.. ఒకప్పుడు ఇది పురాతన లిహ్యానిట్స్(డెడానైట్స్)కు రాజధానిగా సేవలందించిన చరిత్రను కలిగి ఉంది.
ఈ నేపథ్యంలో సౌదీ రాజధాని నుంచి పురాతన నగరం అల్ ఉలాకు మధ్య ప్రయాణ సమయంలో ట్రావెలర్స్ పురావస్తు పరిశోధనలను తిలకించగలరు. ఈ ప్రదేశాన్ని అరేబియా ద్వీపకల్పంలో దాచబడిన రత్నంగా పరిగణిస్తారు. అంతర్జాతీయ సందర్శకులను ఆకర్షించేందుకు ఈ ఫ్లయింగ్ మ్యూజియమ్ సహాయం చేయనుంది. అంతేకాకుండా ప్రయాణికుల ఇన్ఫోటైన్‌మెంట్ కోసం సౌదియా ఎయిర్ లైన్స్ కొత్త ఇన్-ఫ్లైట్ ఎంటర్‌టైన్‌మెంట్ సిస్టమ్(IFE) చానెల్‌ను కూడా ప్రవేశపెట్టింది.