Rangareddy: రాష్ట్రంలో అమలవుతున్న కొత్త డైట్.. విద్యార్థుల హర్షం!

by Ramesh Goud |
Rangareddy: రాష్ట్రంలో అమలవుతున్న కొత్త డైట్.. విద్యార్థుల హర్షం!
X

దిశ రంగారెడ్డి బ్యూరో / వికారాబాద్ ప్రతినిధి : తెలంగాణ రాష్ట్రంలో గురుకులాల్లో చదువుతున్న విద్యార్థులకు నాణ్యమైన పౌష్టికాహారం అందించడమే లక్ష్యంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈమధ్యే కామన్ డైట్ మెనూను ప్రారంభించింది. గత శనివారం రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ చిలుకూరు గ్రామంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నూతన కామన్ డైట్ మెనూను ప్రారంభించగా, వికారాబాద్ జిల్లాలో ఎన్నేపల్లి మైనారిటీ రెసిడెన్షియల్ బాలికల పాఠశాల, కళాశాలలో తెలంగాణ శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ ప్రారంభించారు. గత ప్రభుత్వం గురుకుల విద్యార్థులపై నిర్లక్ష్యం వహించిందన్న వారు.. తమ ప్రభుత్వం 40 శాతం డైట్ చార్జీలు పెంచడం, 200 కా స్మోటిక్ చార్జీలు పెంచి విద్యార్థులకు నాణ్యమైన విద్యతోపాటు పౌష్టికాహారం అందిస్తున్నామని పేర్కొన్నారు. ఇదిలా ఉంటే.. కొత్త డైట్ మెనూ ప్రారంభం అయ్యి నేటికి ఏడు రోజులు అవుతుందన్నారు. ఈ సందర్భంగా గురుకుల పాఠశాలను సందర్శించగా.. కొత్త మెనూపై గురుకుల విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. హాస్టల్‌లో ఇలాంటి నాణ్యమైన పౌష్టికాహారం తింటామని ఊహించలేదని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నారు. వికారాబాద్ జిల్లాలో మొత్తం 9 సాంఘిక సంక్షేమ గురుకులాలు ఉండగా, అందులో ఒకటి సాంఘిక సంక్షేమ డిగ్రీ కళాశాల ఉంది. ఇది ప్రస్తుతం రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో కొనసాగుతున్నది. ఈ గురుకుల పాఠశాల, కళాశాలలో పనిచేస్తున్న ప్రిన్సిపల్స్, ఉపాధ్యాయులు, పిల్లల తల్లిదండ్రులు సైతం ప్రభుత్వం తీరుపై ప్రశంసలు కురిపిస్తున్నారు. 40 శాతం డైట్ మెనూను పెంచడంతో పిల్లలు సంతోషంగా భోజనం చేస్తున్నారు. అందుకు కారణమైన ప్రభుత్వానికి విద్యార్థుల తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు.

కొత్త మెనూపై విద్యార్థుల హర్షం..

గతంలో హాస్టల్‌లో భోజనం చేయాలంటే అయిష్టంగానే తినేవాళ్లం. ఇలాంటి నాణ్యమైన పౌష్టికాహారం తింటామని ఊహించలేదు. నెలలో మొదటి, 3వ ఆ దివారం రెండుసార్లు మటన్ కర్రీతో కూడిన మధ్యాహ్న భోజనం పెడుతున్నారు. మిగతా ఆదివారాలతో పాటు నెలలో మొదటి, 3వ బుధవారం కూడా మొత్తం 4 సార్లు చికెన్ కర్రీతో కూడిన నాణ్యమైన భోజనం పెడుతున్నారు. వీటితో పాటు ప్రతిరోజూ టిఫిన్స్, పాలు, గుడ్డు, పండ్లతో కూడిన నాణ్యమైన పౌ ష్టికాహారం పెడుతున్నారు. ఇంతమంది న్యూ డైట్ మెనూ అందిస్తున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి విద్యార్థులు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నారు.

సీఎం రేవంత్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డైట్ ఛార్జీలు పెంచడంతో హాస్టళ్లలో విద్యార్థులందరికీ నాణ్యమైన ఆహారం అందుతుంది. ఇంతకుముందు నెలలో చికెన్ నాలుగు సార్లు వచ్చేది. కానీ ఇప్పుడు చికెన్‌తో పాటు నెలలో 2 సార్లు మటన్ కూడా ఇస్తున్నారు. అంతే కాకుండా పండ్లు, ప్రతిరోజూ గుడ్డు, నెయ్యి మొదలైన పోషక విలువలతో కూడిన ఆహారాన్ని అందిస్తున్నందుకు విద్యార్థులందరి తరఫున ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నామని వికారాబాద్ జిల్లా శివారెడ్డిపేట్ తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల/కళాశాల 10వ తరగతి విద్యార్థి కే మనోహర్ సిద్ధార్థ చెప్పారు.

సంతోషంగా భోజనం చేస్తున్నారు..

తెలంగాణ ప్రభు త్వం 40 శాతం డై ట్ చార్జీలు పెంచ డం, 200 కాస్మో టిక్ చార్జీలు పెంచి విద్యార్థులకు నాణ్య మైన విద్యతోపాటు పౌష్టికాహారం అం దించడం అభినందనీయం. దీంతో విద్యార్థులు సంతోషంగా భోజనం చేస్తున్నారు. విద్యార్థులకు మంచి పౌష్టికాహారం అందించడంతో అనారోగ్య సమస్యలు రావు. శరీర ఎదుగుదల కూడా పెరుగుతుంది. దాంతో చదువుపై మంచి దృష్టిపెట్టే అవకాశం ఉంటుందని వికారాబాద్ జిల్లా డీసీవో కొండపనేని సాయిలత తెలిపారు.

నాణ్యమైన పౌష్టికాహారం పెడుతున్నారు..

గతంతో పోల్చితే ఇప్పుడు ప్రతిరో జూ నాణ్యమైన పౌష్టికాహారం పె డుతున్నారు. ఒక ప్పుడు భోజనం చే యాలంటే పెద్దగా ఇష్టం ఉండేది కా దు. ఇప్పుడు మా త్రం రోజూ ఒక వెరైటీ పెడుతున్నారు. ఆదివా రం వస్తే చాలు.. మటన్, చికెన్ కర్రీతో భోజ నం పెడుతున్నారు. నిజం చెప్పాలంటే ప్రస్తుత మెనూ కార్పొరేట్ హాస్టల్స్ స్థాయిలో ఉంది. సీఎం రేవంత్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు అని కొత్తగడి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల/కళాశాల ఇంటర్ 2వ సంవత్సరం విద్యార్థిని దీక్షిత అన్నారు.

Advertisement

Next Story

Most Viewed