- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఎస్సై మాటలకు నేను చనిపోతున్నా... ఓ రైతు ఆవేదన..
దిశ, లింగాల : ఎస్సై తిట్టిన మాటలకు నేను చనిపోతున్న అంటు ఓ రైతు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన నాగర్ కర్నూల్ జిల్లాలోని లింగాల మండలం పరిధిలోని అప్పాయిపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. ప్రస్తుతం ఆత్మహత్యాయత్నానికి పాల్పడుతూ రైతు రిలీజ్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రైతు పురుషోత్తం వీడీయోలో పురుగుల మందు సేవించి ఆత్మహత్యయత్నానికి పాల్పడుతున్న, చనిపోతున్న అంటూ తెలిపారు.
తన చేను పక్కన ఓ రైతు భూమి అమ్ముతుండగా కొనుగోలు చేయబోయిన పురుషోత్తంకి అదే గ్రామనికి చెందిన మల్లయ్య యాదవ్ వ్యక్తి అడ్డు వచ్చి తనను ఇబ్బంది పెట్టి ఎస్సై దగ్గరికి పిలిపించారన్నారు. ఎస్సై నాగరాజు యాదవ్ రైతును ఎన్నడూ ఎవరూ తిట్టని విధంగా బూతు మాటలు తిట్టాడని, పురుషోత్తమ్ క్రిమి సంహారక మందు చూపిస్తూ విడియో ద్వారా గ్రామ గ్రూపులో, పాత్రికేయ గ్రూప్ కు పంపారు. వారు ఎక్కడ ఉన్నారు. అనేది తెలియాల్సి వుంది. ఈ విషయం పై ఎస్సై నాగరాజు భూముల విషయాలలో జోక్యం చేసుకుంటున్నారని అరోపణలు చాలా వినిపిస్తున్నాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.