- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డికి పితృవియోగం
దిశ, తిమ్మాజీపేట: నాగర్ కర్నూల్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తండ్రి మర్రి జంగిరెడ్డి (80) తుది శ్వాస విడిచారు. గత కొంతకాలంగా ఆయన తీవ్ర అనారోగ్యంతో బాధపడుతుండగా ఇటీవలే జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆసుపత్రిలో చేర్పించారు. ఆయన ఆరోగ్యం మరింత విషమించడంతో చికిత్స పొందుతూ ఇవాళ తెల్లవారుజామున మృతిచెందారు. జంగిరెడ్డి దంపతులకు మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డితో పాటు మరో కుమారుడు వెంకట్ రెడ్డి, కూతురు ఇందిరమ్మ కూడా ఉన్నారు. కాగా, జంగిరెడ్డి మృతదేహాన్ని ఇవాళ ఉదయం 9 గంటలకు హైదరాబాద్ నుంచి నేరుగా వారి స్వగ్రామం తిమ్మాజీపేట మండలం నేరేళ్లపల్లికి తీసుకురానున్నారు. అభిమానులు, పార్టీ శ్రేణులు బంధువుల సందర్శనార్థం మధ్యాహ్నం వరకు పార్థీవ దేహాన్ని దర్శనార్థం అక్కడే ఉంచనున్నారు. మధ్యాహ్నం 2 గంటల తర్వాత అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు మర్రి జనార్ధన్ రెడ్డి కుటుంబ సభ్యులు, బంధువులు తెలిపారు.