Zelenskyy: రష్యాకు ఉత్తరకొరియా సైన్యం.. జెలెన్ స్కీ సంచలన ఆరోపణలు

by vinod kumar |
Zelenskyy: రష్యాకు ఉత్తరకొరియా సైన్యం.. జెలెన్ స్కీ సంచలన ఆరోపణలు
X

దిశ, నేషనల్ బ్యూరో: ఉత్తర కొరియా తన సైన్యాన్ని రష్యాకు పంపిందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ ఆరోపించారు. యుద్ధాన్ని నివారించడానికి మరింత మద్దతివ్వాలని మిత్ర దేశాలకు విజ్ఞప్తి చేశారు. సోమవారం ఆయన ఓ వీడియో ప్రసంగం ఇచ్చారు. రష్యా, ఉత్తర కొరియా మధ్య పెరుగుతున్న స్నేహాన్ని చూస్తున్నామని, ఇప్పటికే రష్యాకు నార్త్ కొరియా ఆయుధాలను, దళాలను పంపిందని తెలిపారు. కాబట్టి ప్రస్తుత పరిస్థితిలో తమ మిత్ర దేశాలతో సంబంధం మరింత బలంగా ఉండాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఆయుధాల సరఫరా నుంచి సైన్యాన్ని పంపడమే ఆందోళనగా ఉందన్నారు. రష్యాపై యుద్ధంలో భాగంగా మరింత సైనిక, ఆర్థిక సహాయం కోరేందుకు అనేక యూరోపియన్ దేశాలను సందర్శించిన కొద్ది రోజుల తర్వాత జెలెన్ స్కీ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. కాగా, రష్యా సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకునేందుకు దీర్ఘ-శ్రేణి సామర్థ్యం గల ఆయుధాలు కావాలని జెలెన్ స్కీ చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నారు. అయితే ఈ ప్రతిపాదనకు ఉక్రెయిన్ మిత్ర దేశాలు అంగీకరించడం లేదు.

Advertisement

Next Story

Most Viewed