- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రెండేళ్ల తర్వాత చైనాను దాటనున్న Xi Jinping to Meet Vladimir Putin
బీజింగ్: చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ రెండేళ్ల తర్వాత తొలిసారిగా దేశం దాటనున్నారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను కలిసేందుకు బుధవారం కజకిస్తాన్ పర్యటనకు వెళ్లనున్నారు. పుతిన్‌తో సమావేశమవ్వడమే కాకుండా షాంఘై సదస్సులోనూ ఆయన పాల్గొననున్నారు. కరోనా మహమ్మారి వచ్చాక జిన్‌పింగ్ చేస్తున్న విదేశీ పర్యటన ఇదే కావడం గమనార్హం. ఇరు దేశాలకు యూఎస్ వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో దేశాధినేతల సమావేశం కీలకం కానుంది. ఈ సమావేశం ద్వారా చైనా అధ్యక్షుడు తన సామర్థ్యాన్ని ప్రదర్శించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.
పశ్చిమ దేశాలు ఉక్రెయిన్ యుద్ధానికి రష్యాను శిక్షించాలని చూస్తున్నట్లే ఇరువురు నాయకులూ యునైటెడ్ స్టేట్స్ పట్ల తమ వ్యతిరేకతను చూపించే అవకాశం ఉంది. ఇప్పటికే అమెరికా కీలక నేత తైవాన్ పర్యటన పట్ల డ్రాగన్ దేశం ఆగ్రహాంగా ఉన్న సంగతి తెలిసిందే. మరోవైపు యూకే రాజుగా నియమితులైన కింగ్ ఛార్లెస్‌కు జిన్‌పింగ్ అభినందనలు తెలుపుతూ సందేశం పంపారు. ఇరు దేశాల సంబంధాలను బలోపేతం చేసేందుకు కలిసి పనిచేసేందుకు సిద్ధమని ఆయన పేర్కొన్నారు. అయితే భారత ప్రధాని నరేంద్ర మోడీతో సమావేశమయ్యే విషయమై ఎలాంటి స్పష్టత లేదు.