- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కాసేపు కనిపించకుండా పోయిన బుర్జ్ ఖలీఫా.. అంతా గందరగోళం!
దిశ, వెబ్‌డెస్క్ః బుర్జ్ ఖలీఫా పేరు వింటేనే ఆలోచన ఆకాశాన్ని తాకుతుంది! ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన నిర్మాణమైన బుర్జ్ ఖలీఫా మాయమవడం ఏంటని ఆశ్చర్యపోవడం సహజమే. అయితే, ఇటీవలి రోజుల్లో ఇరాక్, కువైట్, సౌదీ అరేబియా, ఇరాన్, ఇతరత్రా దేశాల తర్వాత ఇసుక తుఫాను UAEని కూడా తాకింది. దీనితో బుర్జ్ ఖలీఫా బుధవారం మందపాటి దుమ్ము పొర వెనుక అదృశ్యమయ్యింది. 2716 అడుగుల పొడవుతో యావత్ దుబాయ్ నగరం అంతటా కనిపించే ఈ భవనం కొంత సేపు కనిపించకుండా పోయిన దృశ్యలను ఇంటర్నెట్‌లో పోస్ట్ చేశారు. పూర్తిగా ఇసుక తుఫానుతో కప్పబడిన రాజధాని నగరం అబుధానిలో గాలి నాణ్యత సూచిక (AQI) కూడా ప్రమాదకర స్థాయికి చేరుకుంది. అయితే, బుర్జ్ ఖలీఫా కూడా అదృశ్యం అయ్యిందంటూ నెటిజన్లు ఈ వీడియోలను వైరల్ చేశారు. ఈ సందర్భంగా ఇసుక తుఫాను ఫోటోలు, వీడియోలను పోస్ట్ చేయడానికి చాలా మంది వినియోగదారులు సోషల్ మీడియాలోకి వెళ్లడంతో ఇక, డ్రైవింగ్‌లో వీడియోలు, ఫొటోలు తీసుకోవద్దని నగర పోలీసులు ప్రజలను కోరారు. ఇక, ఈమధ్య పెరుగుతున్న ఇలాంటి ఇసుక తుఫానులు పర్యావరణంలో వచ్చిన మార్పు వల్లనే అని, ఇకనైనా అందరూ కలిసి కాలుష్యాన్ని తగ్గించకపోతే, బుర్జ్ ఖలీఫా నిజంగానే అదృశ్యమయ్యే అవకాశం ఉందని కొందరు పేర్కొన్నారు.
NEW: Burj Khalifa: World's tallest building engulfed as sandstorms hit UAE https://t.co/h44MFAIELq pic.twitter.com/acAfVhm15F
— Insider Paper (@TheInsiderPaper) May 18, 2022