- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రపంచంలోనే అత్యంత ఒంటరి ఏనుగు..ఇలా జీవిస్తోంది! (వీడియో)
దిశ, వెబ్‌డెస్క్ః మనుషుల్లా చాలా జంతువులు కుటుంబాలుగా, గుంపులుగా జీవిస్తుంటాయి. వాటిల్లో ఏనుగు కూడా ఒకటి. కానీ, ఈ ఏనుగు మాత్రం చాలా భిన్నమైంది. ఇది ప్రపంచంలోనే అత్యంత ఒంటిరిగా జీవిస్తున్న ఏనుగుగా గుర్తింపు పొందింది. కావన్ అనే పేరున్న ఈ ఏనుగు ఒంటరిగా జీవించడానికి కారణం మనుషులే. ఇప్పుడు 37 ఏళ్ల వయస్సున్న కావన్ శ్రీలంక నుండి 1985లో బహుమతిగా పాకిస్థాన్‌కు చేరుకుంది. అప్పటి నుండి 35 సంవత్సరాల పాటు బందిగానే బతికింది. 22 ఏళ్లు కావన్‌తో కలిసి బతికిన జీవిత భాగస్వామి, సహేలీ, 2012లో మరణించిగా, అప్పటి నుండి కావన్ పాకిస్థాన్‌లోని ఇస్లామాబాద్ జూలో ఒంటరిగా గడిపింది. అక్కడ మిగిలున్న ఒకే ఒక్క ఆసియా ఏనుగు కూడా ఇదే కావడం గమనార్హం.
అయితే, కావన్ సంతోషం కోసం కొందరు తీవ్రంగా పోరాడారు. అమెరికన్ గాయకుడు చెర్ చేత విస్తృతంగా మద్దతివ్వగా, కావన్ ప్రపంచంలో ఒంటరిగా జీవిస్తున్న ఏనుగు అని అందరికీ తెలిసింది. ఏనుగును ఒంటరిగా ఉంచిన జంతుప్రదర్శనశాల నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా ప్రచారం కొనసాగించారు. దీనితో, మే 2020లో, ఇస్లామాబాద్ హైకోర్టు కావన్‌తో పాటు 38 ఇతర జంతువులను అభయారణ్యాలకు తరలించాలని తీర్పునిచ్చింది. తర్వాత కావన్ రెస్క్యూ, పునరావాస మిషన్ ద్వారా, అదే సంవత్సరం నవంబర్ 30న కంబోడియా వన్యప్రాణుల అభయారణ్యంలో కావన్‌కి కొత్త ఆవాసం దొరికింది. ప్రస్తుతం కంబోడియా వన్యప్రాణుల అభయారణ్యంలో సంతోషంగా జీవితాన్ని గడుపుతోంది. స్వేచ్ఛగా, ఇంకొన్ని ఏనుగుల సహవాసంలో కావన్ ఆనందిస్తున్నట్లు స్థానికి మీడియా ప్రకటించింది. దీన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో 'సేవ్ ఎలిఫెంట్ ఫౌండేషన్' షేర్ చేసింది.