- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
గాజాలో నరమేధం ఆపండి.. ఇజ్రాయెల్‌కు ప్రపంచ కోర్టు ఆర్డర్
దిశ, నేషనల్ బ్యూరో : గాజాపై ఇజ్రాయెల్ చేస్తున్న అమానవీయ దాడులను ఆపాలని కోరుతూ దక్షిణాఫ్రికా సహా పలు దేశాలు దాఖలు చేసిన పిటిషన్‌పై అంతర్జాతీయ న్యాయస్థానం(ఐసీజే) శుక్రవారం కీలక తీర్పు ఇచ్చింది. గాజాలో సైనిక కార్యకలాపాలను వెంటనే నిలిపివేయాలని ఇజ్రాయెల్‌ను ఆదేశించింది. గాజా ప్రజలకు శారీరక, మానసిక నష్టం జరగకుండా చూడాలని నిర్దేశించింది. ‘‘గాజాలో ఇజ్రాయెల్ ఆర్మీ నరమేధానికి పాల్పడకుండా చూడాల్సిన బాధ్యత ఇజ్రాయెల్ ప్రభుత్వంపైనే ఉంటుంది. గాజాలో మానవతా పరిస్థితిని మెరుగు పరిచేందుకు చర్యలు తీసుకోవాలి’’ అని అంతర్జాతీయ న్యాయస్థానం సూచించింది. ఈ ఆదేశాల అమలుకు ఇజ్రాయెల్ తీసుకున్న చర్యలపై ఒక నెలలోగా నివేదిక ఇవ్వాలని కోరింది. ‘‘గాజాలో జరుగుతున్న మానవ హననం గురించి మాకు తెలుసు. అక్కడ జరుగుతున్న ప్రాణనష్టం, గాజావాసులు పడుతున్న అవస్థలపై మేం తీవ్ర ఆందోళనగా ఉన్నాం’’ అని ఐసీజే వ్యాఖ్యానించింది. కోర్టులో దక్షిణాఫ్రికా వాదనలు వినిపిస్తూ.. అక్టోబరు 7 హమాస్ దాడికి ముందు కూడా గాజాలో ఇజ్రాయెల్ ఆర్మీ అరాచకాలు కొనసాగాయని గుర్తు చేసింది. దానికి సంబంధించిన ఆధారాలను కోర్టుకు సమర్పించింది. ఐసీజే ప్రెసిడెంట్ ఈ డినోగ్యూతో సహా 17 మంది న్యాయమూర్తులతో కూడిన అంతర్జాతీయ న్యాయస్థానం ధర్మాసనం దక్షిణాఫ్రికా వాదనలతో ఏకీభవించింది. తమ దేశంపై దాఖలైన మారణహోమం ఆరోపణలను రద్దు చేయాలని న్యాయస్థానాన్ని ఇజ్రాయెల్ కోరింది. ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు స్పందిస్తూ.. తమ దేశంపై ఐసీజేలో మారణహోమం, నరమేధం కేసు నమోదు చేయడం దౌర్జన్యమైన చర్య అని పేర్కొన్నారు. ఇజ్రాయెల్ తనను తాను రక్షించుకోవడానికి ఏం చేయాలో అది చేసి తీరుతుందని స్పష్టం చేశారు.