- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
మహిళలు బహిరంగంగా మాట్లాడొద్దు, పాటలు పాడొద్దు,పురుషులను చూడొద్దు .. కొత్త చట్టం రూపొందించిన దేశం.. ఎక్కడంటే..?
దిశ, వెబ్‌డెస్క్: ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబన్లు అధికారం చేపట్టి ఇటీవలే 3 సంవత్సరాల పాలనను పూర్తి చేసుకున్నారు. ఇదిలా ఉంటే అక్కడ ప్రజలపై ఆంక్షలు రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా మహిళలపై కఠిన ఆంక్షల కొరడాను తాలిబన్లు మరోసారి ఝలిపించారు. ఆఫ్ఘనిస్తాన్‌లో మహిళలు తమ గొంతులను బహిరంగంగా వినిపించడంపై నిషేధం విధించారు. అంటే బహిరంగంగా పాడడం లేదా చదవడాన్ని తాలిబన్ ప్రభుత్వం నిషేధించింది. ఈ కొత్త చట్టానికి సంబంధించిన నిర్ణయాన్ని తాలిబాన్ నాయకుడు హిబతుల్లా అఖుంద్‌జాదా తాజాగా ప్రకటించారు. ఈ కొత్త చట్టం ప్రకారం మహిళలు బహిరంగ ప్రదేశాల్లో తమ ముఖంతో సహా మొత్తం శరీరాన్ని కప్పుకోవాలి. అలాగే ఇక నుంచి మహిళలు తమ గొంతుని బహిరంగంగా వినిపించడానికి అవకాశం లేదు. ఈ నియమాలతో స్త్రీలను పాడటమే కాదు ఏ విధమైన బహిరంగ సంభాషణ కూడా చేయడానికి వీలు లేదు.ఈ చట్టం ప్రకారం స్త్రీలు తమకు సంబంధం లేని పురుషుల వైపు చూడటానికి కూడా అవకాశం లేదు.
మహిళలు అక్రమ సంబంధం పెట్టుకుంటే..?
అంతర్జాతీయ సమాజం చెబుతున్నట్లు ఆఫ్ఘనిస్తాన్‌లో మహిళలకు ప్రత్యేక హక్కులు ఉండవని , ప్రతి ఒక్కరు షరియా చట్టం ప్రకారం నడుచుకోవాలని సుప్రీం నాయకుడు హిబతుల్లా అఖుంద్‌జాదా మహిళలను హెచ్చరించారు. ఈ కొత్త చట్టం ప్రకారం మహిళలు ముస్లిమేతర పురుషులు, మహిళల ముందు కూడా తమను తాము కవర్ చేసుకోవాలి. అంతే కాకుండా మహిళలు బిగుతుగా , పొట్టిగా ఉన్న దుస్తులు ధరించరాదని చట్టంలో పేర్కొన్నారు.అలాగే ఎవరైనా వివాహేతర సంబంధాలు పెట్టుకున్న, వ్యభిచార ఘటనల్లో మహిళలు పట్టుబడ్డ వారిని అందరూ చూస్తుండగానే కొయ్యకు కట్టేసి రాళ్లతో కొట్టి చంపుతామని అఖుంద్‌జాదా తీవ్రంగా హెచ్చరించారు.
ఈ ఆంక్షలపై ఐక్యరాజ్యసమితి ఏం చెప్పిందంటే..?
ఈ కొత్త నిబంధనలపై ఐక్యరాజ్యసమితి ఆందోళన వ్యక్తం చేసింది.తాలిబన్లు పెట్టిన ఆంక్షలు ఆఫ్ఘనిస్తాన్‌లోని మహిళల జీవితాన్ని మరింత కష్టతరం చేసే విధంగా ఉన్నాయని సంస్థ పేర్కొంది. అంతర్జాతీయ సమాజం ఈ సమస్యను తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇది ఆఫ్ఘనిస్తాన్‌లో మహిళల హక్కులకు సంబంధించిన అంశం మాత్రమే కాదు, ఇది మానవ హక్కుల ఉల్లంఘన కూడా అంటూ ఆందోళన వ్యక్తం చేస్తోంది.