Ponnam Prabhakar: సమాచారం గోప్యంగా ఉంచుతాం.. మంత్రి పొన్నం భరోసా

by Gantepaka Srikanth |
Ponnam Prabhakar: సమాచారం గోప్యంగా ఉంచుతాం.. మంత్రి పొన్నం భరోసా
X

దిశ, వెబ్‌డెస్క్: హుస్నాబాద్‌లో కులగణన(Caste Census Survey), సమగ్ర కుటుంబ సర్వేను మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhakar) పరిశీలించారు. ఈ సందర్భంగా అక్కడ మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా 87 వేల మంది ఎన్యుమరేటర్లతో సర్వే కొనసాగుతోందని అన్నారు. సర్వే వల్ల సంక్షేమ పథకాల్లో కోత ఉండదని స్పష్టం చేశారు. సర్వేలో వెల్లడించిన సమాచారం మొత్తం గోప్యంగా ఉంచుతామని భరోసా ఇచ్చారు. అన్ని రకాల అసమానతలను తొలగించేందుకు, కులాల జనాభా తెలుసుకునేందుకు సర్వే చేస్తున్నట్లు తెలిపారు. కాగా, రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 6వ తేదీ నుంచి సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేను ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈనెల 30 వరకు కార్యక్రమం నిర్వహించనున్నారు. ఒక్కో ఎన్యూమరేటర్ 150 నుంచి 175 ఇళ్ల దాకా కేటాయించారు. కుటుంబ వ్యక్తిగత వివరాలను ఎన్యూమరేటర్లు సేకరిస్తున్నారు. ప్రతి ఇంటికీ వెళ్లి ప్రతి కుటుంబంలోని సభ్యులందరి సమగ్ర వివరాలను నమోదు చేస్తున్నారు.

Advertisement

Next Story