Vivek Agnihotri: వివేక్ అగ్నిహోత్రి ‘ది దిల్లీ ఫైల్స్’ రిలీజ్ డేట్ ఫిక్స్..

by Hamsa |
Vivek Agnihotri: వివేక్ అగ్నిహోత్రి ‘ది దిల్లీ ఫైల్స్’ రిలీజ్ డేట్ ఫిక్స్..
X

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి(Vivek Agnihotri) ‘ది కాశ్మీర్ ఫైల్స్’ సినిమాతో సంచలనం సృష్టించారు. అంతేకాకుండా భారీ విజయాన్ని సాధించడంతో పాటు విమర్శలు కూడా ఎదుర్కొన్నారు. ప్రజెంట్ వివేక్ అగ్రిహోత్రి దర్శకత్వంలో ‘ది దిల్లీ ఫైల్స్’ (The Delhi Files)రాబోతుంది. ‘ది బెంగాల్ చాప్టర్’ అనేది దీనికి ఉపశీర్షిక. ఈ చిత్రాన్ని అభిషేక్ అగర్వాల్(Abhishek Agarwal) ఆర్ట్స్ బ్యానర్‌పై అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్నారు. అయితే ‘ది దిల్లీ ఫైల్స్’ సినిమా రెండు పార్టులుగా రాబోతున్నట్లు ఇటీవల మేకర్స్ వెల్లడించారు. తాజాగా, ఈ మూవీ విడుదల తేదీని ప్రకటించారు. ‘ది దిల్లీ ఫైల్స్’(The Delhi Files) ఆగస్టు 15న ఇండిపెండెన్స్‌ కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు పోస్టర్ ద్వారా తెలిపారు. దీంతో ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు బెంగాల్ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ ఎలక్షన్ ప్లాన్ అని కామెంట్లు చేస్తున్నారు.

Next Story

Most Viewed