ఆయుధాలను వదిలేస్తాం.. కానీ అవి చేయండి : హమాస్

by Hajipasha |
ఆయుధాలను వదిలేస్తాం.. కానీ అవి చేయండి : హమాస్
X

దిశ, నేషనల్ బ్యూరో : ఇజ్రాయెల్ - పాలస్తీనా మధ్య గత ఏడు నెలలుగా భీకర యుద్ధం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ప్రముఖ అంతర్జాతీయ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పాలస్తీనా మిలిటెంట్ సంస్థ హమాస్ సీనియర్ నేత ఖలీల్ అల్ హయ్యా కీలక వ్యాఖ్యలు చేశారు. తాము ఆయుధాలను వదిలి పెట్టేందుకు సిద్ధమని.. అయితే అందుకోసం పాలస్తీనాను స్వతంత్ర దేశంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఒకవేళ పాలస్తీనాను దేశంగా ప్రకటిస్తే.. తమ మిలిటెంట్లు అందరూ సైనికులుగా మారుతారని, మిలిటెంట్ సంస్థలన్నీ రాజకీయ పార్టీలుగా మారిపోతాయని ఖలీల్ వెల్లడించారు. ‘‘పాలస్తీనాను దేశంగా ప్రకటిస్తే.. ఇజ్రాయెల్‌తో గరిష్ఠంగా ఐదేళ్ల కాల్పుల విరమణకు మేం సిద్ధం. ఇజ్రాయెలీ జైళ్లలో మగ్గుతున్న పాలస్తీనా పౌరులందరినీ విడుదల చేయాల్సి ఉంటుంది. 1967 సంవత్సరానికి మునుపటి పాలస్తీనా భూభాగాన్ని ఇజ్రాయెల్ మాకు అప్పగించాల్సి ఉంటుంది’’ అని ఆయన పేర్కొన్నారు. గతేడాది అక్టోబరు 7న ఇజ్రాయెల్‌పై హమాస్ చేసిన దాడిలో తప్పేమీ లేదని ఖలీల్ స్పష్టం చేశారు.

Advertisement

Next Story

Most Viewed