మంకీపాక్స్‌కు మొదటి వ్యాక్సిన్‌ను ఆమోదించిన WHO

by Harish |
మంకీపాక్స్‌కు మొదటి వ్యాక్సిన్‌ను ఆమోదించిన WHO
X

దిశ, నేషనల్ బ్యూరో: ప్రపంచదేశాల్లో వేగంగా విస్తరిస్తున్న మంకీపాక్స్‌ నుంచి రక్షించడానికి బవేరియన్ నార్డిక్ తయారు చేసిన MVA-BN వ్యాక్సిన్‌కు ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) ఆమోదం తెలిపింది. ఆఫ్రికా దేశాల్లో కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో వ్యాప్తిని అరికట్టడంలో ఇది సహాయపడుతుందని ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ వ్యాక్సిన్‌ను 18 ఏళ్లు పైబడిన వారికి నాలుగు వారాల వ్యవధిలో రెండు-డోస్ ఇంజెక్షన్‌గా ఇవ్వవచ్చని, వ్యాక్సిన్‌ను 2-8 డిగ్రీల సెల్సియస్ వద్ద ఎనిమిది వారాల వరకు ఉంచవచ్చని WHO తెలిపింది.

అందుబాటులో ఉన్న డేటా ప్రకారం, మొదటి డోస్‌లో వ్యాక్సిన్ ప్రజలను mpox నుండి రక్షించడంలో 76 శాతం ప్రభావాన్ని కలిగి ఉందని తెలుస్తుంది. తరువాత రెండో డోస్‌ 82 శాతం ప్రభావాన్ని కలిగి ఉంది. WHO డైరెక్టర్ జనరల్ డాక్టర్ టెడ్రోస్ ఒక ప్రకటనలో మాట్లాడుతూ, ఆఫ్రికాలో ప్రస్తుత వ్యాప్తి నేపథ్యంలో, భవిష్యత్తులో ఈ వ్యాధికి వ్యతిరేకంగా మా పోరాటంలో టీకా మొదటి ముందస్తు అర్హత ఒక ముఖ్యమైన దశ. అంటువ్యాధులను నివారించడానికి, వ్యాప్తిని ఆపడానికి, ప్రాణాలను రక్షించడానికి, వ్యాక్సిన్‌లు అత్యంత అవసరం అని అన్నారు.

Advertisement

Next Story

Most Viewed