ఉగ్ర చర్యలకు పాల్పడిన ఐరాస సిబ్బందిని శిక్షిస్తాం: ఇజ్రాయెల్ ఆరోపణలపై స్పందించిన గుటెర్రెస్

by samatah |
ఉగ్ర చర్యలకు పాల్పడిన ఐరాస సిబ్బందిని శిక్షిస్తాం: ఇజ్రాయెల్ ఆరోపణలపై స్పందించిన గుటెర్రెస్
X

దిశ, నేషనల్ బ్యూరో: గతేడాది అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై హమాస్ చేసిన దాడిలో కొంత మంది ఐక్యరాజ్యసమితి శరణార్థి ఏజెన్సీకి చెందిన సభ్యులు ఉన్నారని ఇజ్రాయెల్ ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. దీంతో తొమ్మిది దేశాలు ఐక్యరాజ్య సమితి శరణార్థుల ఏజెన్సీ (యూఎన్ఆర్‌డబ్లూఏ)కి నిధులు నిలిపివేశాయి. ఈ నేపథ్యంలో ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రస్ స్పందించారు. ఉగ్రవాద చర్యల్లో పాల్గొన్న ఏ ఐరాస ఉద్యోగినైనా శిక్షిస్తామని స్పష్టం చేశారు. వారిపై దర్యాప్తు చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. పాలస్తీనియన్ల కోసం యూఎన్ఆర్‌డబ్లూఏకి మద్దతు ఇవ్వడం కొనసాగించాలని ఆయా దేశాలను కోరారు. ఈ నిర్ణయం ఆందోళనకు గురి చేస్తుందని చెప్పారు. వారు చాలా ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్నారు. ఈ టైంలో నిధులు నిలిపివేయడం సరికాదని సూచించారు. ‘ఆరోపణలు ఎదుర్కొంటున్న 12 మందిలో తొమ్మిది మందిని ఇప్పటికే తొలగించాం. అందులో ఒకరు చనిపోయారు. మిగిలిన ఇద్దరినీ గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నాం’ అని తెలిపారు. కాగా, బ్రిటన్, జర్మనీ, ఇటలీ, నెదర్లాండ్స్, స్విట్జర్లాండ్, ఫిన్లాండ్, అమెరికా, ఆస్ట్రేలియా, కెనడాలు ఇజ్రాయెల్ ఆరోపణల తర్వాత గాజాలోని ప్రజలకు సహాయం అందించే సంస్థకు నిధులను నిలిపివేశాయి.

Advertisement

Next Story