'పుతిన్‌పై తిరుగుబాటు చేసిన ప్రిగోజిన్ హతం..?'.. అమెరికా మాజీ సైనిక జనరల్ సంచలన కామెంట్స్

by Vinod kumar |
పుతిన్‌పై తిరుగుబాటు చేసిన ప్రిగోజిన్ హతం..?.. అమెరికా మాజీ సైనిక జనరల్ సంచలన కామెంట్స్
X

మాస్కో : తన ప్రైవేటు ఆర్మీ "వాగ్నర్ గ్రూప్"తో తిరుగుబాటు చేసి రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు ముచ్చెమటలు పట్టించిన యెవ్జెనీ ప్రిగోజిన్ గుర్తున్నాడా!! పుతిన్‌తో రాజీకి వచ్చిన తర్వాత కనిపించకుండా పోయిన అతడిపై ఒక కొత్త అప్ డేట్ వచ్చింది. పుతిన్‌తో కుదిరిన డీల్‌లో భాగంగా రష్యా నుంచి బెలారస్‌కు వెళ్లిపోతానని చెప్పిన యెవ్జెనీ ప్రిగోజిన్ జాడ గల్లతైంది. అతడు రష్యాలో లేడు.. బెలారస్‌లో లేడు.. మరెక్కడున్నాడు..? అని అంతర్జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి.

ఈ తరుణంలో దక్షిణ కొరియాలో అమెరికా దళాలకు గతంలో సైనిక కమాండర్‌గా పనిచేసిన రిటైర్డ్ జనరల్ రాబర్ట్ అబ్రమ్స్ సంచలన కామెంట్స్ చేశారు. "యెవ్జెనీ ప్రిగోజిన్ ఇప్పటికే చనిపోయి ఉండొచ్చు లేదా జైలులో ఉండొచ్చు. మళ్ళీ మనం ప్రిగోజిన్‌ను చూడలేకపోవచ్చు" అని అభిప్రాయపడ్డాడు. ఒకవేళ ప్రిగోజిన్ బతికి ఉన్నా.. ఎక్కడో జైలులో ఉండి ఉంటాడని చెప్పాడు. ప్రిగోజిన్, అతడి ప్రైవేటు సైన్యం కమాండర్లు.. అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను జూన్ 29న కలిసి రష్యాకు విధేయత చూపుతామని ప్రతిజ్ఞ చేశారని రష్యా ప్రభుత్వ అధికార ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్ జులై 10న చేసిన ప్రకటన ఒట్టి బూటకం అని ఆరోపించాడు.

Advertisement

Next Story