- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మాజీ మంత్రి కుమారుడు అరెస్ట్.. వాలంటీర్ హత్యకు ప్రధాన కారణం ఇదే
దిశ, వెబ్ డెస్క్: వాలంటీర్ హత్యకేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న మాజీమంత్రి కుమారుడు పినిపె విశ్వరూప్ (Pinipe Vishwaroop) కుమారుడు పినిపె శ్రీకాంత్ (Pinipe Srikanth) ను పోలీసులు అరెస్ట్ చేశారు. మూడు రోజుల క్రితమే శ్రీకాంత్ ను మధురైలో అరెస్ట్ చేసినట్లు ఏపీ పోలీసులు వెల్లడించారు. రెండేళ్ల క్రితం అయినవిల్లికి చెందిన వాలంటీర్ దుర్గాప్రసాద్ దారుణ హత్యకు గురయ్యారు. ఆ హత్య వెనకాల శ్రీకాంత్ హస్తం ఉందని మొదటి నుంచీ ఆరోపణలు వస్తున్నా.. అప్పడు అధికారంలో ఉన్నది వైసీపీ కావడంతో ఎలాంటి చర్యలు తీసుకోలేదు. తాజాగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. గత ప్రభుత్వ హయాంలో జరిగిన నేరాల్లో నిందితులైన వారిపై చర్యలు తీసుకుంటోంది.
అంబేద్కర్ కోనసీమ (Konaseema) జిల్లా అయినవిల్లికి చెందిన వాలంటీర్ జనుపల్లి దుర్గాప్రసాద్ (Volunteer Durga Prasad) 2022, జూన్ 6న హత్యకు గురయ్యాడు. పినిపె శ్రీకాంత్ పథకం ప్రకారమే అతడిని హత్యచేయించినట్లు కొత్తపేట డీఎస్పీ గోవిందరావు వెల్లడించారు. సోమవారం రాత్రి తమిళనాడులోని మధురైలో అరెస్ట్ చేసి.. మంగళవారం రాత్రి కొత్తపేట డీఎస్పీ కార్యాలయానికి తీసుకొచ్చినట్లు తెలిపారు. రాత్రి 11 గంటలకు జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ గౌరీశంకర్ రావు ఎదుట హాజరు పరిచినట్లు తెలిపారు. 14 రోజులు రిమాండ్ విధించడంతో రాజమండ్రి సెంట్రల్ జైలుకు (Rajahmundry Central Jail) తరలించారు. నవంబర్ 4వ తేదీ వరకూ శ్రీకాంత్ రిమాండ్ లో ఉండనున్నాడు.
కారణం ఇదే..
వాలంటీర్ దుర్గాప్రసాద్ హత్యకు ప్రధాన కారణం.. ఒక మహిళకు సంబంధించిన వ్యవహారమేనని డీఎస్పీ గోవిందరావు స్పష్టం చేశారు. ఈ కేసులో మరో నిందితుడైన ధర్మేశ్ వైసీపీ సోషల్ మీడియా కన్వీనర్ గా ఉండగా.. దుర్గాప్రసాద్ తో విబేధాలు తలెత్తాయి. దీంతో హత్యకు ప్రణాళిక రచించిన శ్రీకాంత్.. పథకం ప్రకాశం దుర్గాప్రసాద్ ను ధర్మేశ్ ద్వారా కోటిపల్లి రేవుకు తీసుకొచ్చారు. అక్కడ అతని మెడకు తాడుని బిగించి హత్యచేసినట్లు డీఎస్పీ వివరించారు. నాలుగురోజుల తర్వాత డెడ్ బాడీ లభించగా.. మెడకు రెండువైపులా ఎముకలు విరిగిన గుర్తులుండటంతో.. మిస్సింగ్ కేసును హత్యకేసుగా మార్చి దర్యాప్తు చేపట్టారు.