చేతిలో తల్వార్.. రోడ్డు పై హల్ చల్.. కట్ చేస్తే...

by Sumithra |
చేతిలో తల్వార్.. రోడ్డు పై హల్ చల్.. కట్ చేస్తే...
X

దిశ, వరంగల్ : తల్వార్ చేతిలో పట్టుకొని స్థానిక పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న హోంగార్డు సుకుమార్ మంగళవారం రాత్రి కాశీబుగ్గ సెంటర్ లో గల పెరుగు దుకాణాల ముందు స్థానికులు, వ్యాపారస్తులకు, బాటసారులను భయభ్రాంతులకు గురయ్యే విధంగా హల్చల్ చేశాడు. భయభ్రాంతులకు గురైన వ్యాపారస్తులు, స్థానికులు అందించిన సమాచారం మేరకు ఇంతేజర్ గంజ్ పోలీసులు వెంటనే అప్రమత్తమై సంఘటనా స్థలానికి చేరుకొని హోంగార్డును అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. అదే స్థానిక ఇంతేజార్ గంజ్ పోలీస్ స్టేషన్ లో హోంగార్డుగా విధులు నిర్వహిస్తున్న సుకుమార్ మద్యం మత్తులో తల్వార్ చేతిలో పట్టుకుని కాశీబుగ్గలో, పెరుగు అమ్మే దుకాణాల ముందు తిరుగుతుండడం చూసి పోలీసులు కంగు తిన్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Next Story

Most Viewed