- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
సీతగా సాయి పల్లవి.. అందుకే రావణుడుగా చేశా.. స్టార్ హీరో ఇంట్రెస్టింగ్ కామెంట్స్
దిశ, సినిమా: కెరీర్ స్టార్టింగ్‌లో బుల్లితెర హీరోగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి.. తర్వాత కాలంలో పాన్ ఇండియా స్టార్ హీరోగా మారిన యష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మాస్ యాక్షన్ సినిమాలతో సౌత్ ఆడియన్స్ హృదయాల్లో చెరగని స్థానం సంపాదించుకున్నాడు. ఎటువంటి ఫిల్మ్ బ్యాక్ గ్రౌండ్‌లేని ఫ్యామిలీ నుంచి వచ్చి నేడు టాప్ హీరోగా రాణించడం అంటే మామూలు విషయం కాదనే చెప్పాలి. ప్రస్తుతం యష్ ‘టాక్సిక్’ అనే సినిమా చేస్తున్నాడు. ఇక ఈ సినిమా కాకుండా యష్ నటిస్తున్న అతిపెద్ద ప్రాజెక్ట్ ‘రామాయణం’. బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ నితీష్ తివారి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను అల్లు అరవింద్, మధు మంతెన అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు. ఇక ఈ మూవీలో రాముడిగా రణబీర్ కపూర్, సీతగా సాయి పల్లవి, రావణుడిగా యష్ నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి లీకైన ఫొటోస్‌లో సీతారాములుగా రణబీర్, సాయిపల్లవి చూడడానికి ఎంతో అందంగా కనిపించారు.
ఇక ఇప్పటివరకు హీరోగా చేసిన యష్ మొదటిసారి రావణుడిగా కనిపించనుండడంతో ఈ చిత్రంపై అంచనాలు ఆకాశాన్ని దాటాయి. ఇక ఎప్పుడెప్పుడు ఈ సినిమా సెట్‌లోకి యష్ అడుగుపెడతాడా అని అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. తాజాగా యష్ ముంబైలో సందడి చేశాడు. ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన.. ఈ సినిమా గురించి ఆసక్తికరమైన విషయాలను అభిమానులతో పంచుకున్నాడు. ముఖ్యంగా సీత పాత్రకు సాయిపల్లవినే ఎందుకు ఎంపిక చేశారు అన్నదానికి యష్ తన రీతిలో సమాధానం చెప్పుకొచ్చాడు.
ఆయన మాట్లాడుతూ..“సాయిపల్లవి చాలా గొప్ప నటి. రామాయణం అనుకున్నప్పుడు సౌత్, నార్త్ నటీనటులను మొత్తం కలపాలి అనుకున్నాం. రాముడిగా రణబీర్‌ను మేము అనుకున్నాం. కానీ, సాయి పల్లవినే సీతగా చేయాలనీ నితేష్ తివారీ ఎప్పుడూ కోరుకునేవాడు. కాబట్టి మేమంతా కలిసికట్టుగా ఆ నిర్ణయం తీసుకున్నాం. ఆ పాత్రకు ఆమె తగినది. ఇక నా పాత్ర విషయానికొస్తే.. రావణుడుగా కాకుండా నితీష్ నాకు వేరే పాత్రను ఇచ్చి ఉంటే ఖచ్చితంగా నో చెప్పేవాడిని. రావణుడు పాత్ర అనేసరికి నేను ఎస్ చెప్పాను. ఎందుకంటే.. ఒక నటుడిగా రావణుడి పాత్రలో నటించడం నాకు ఇష్టం. ఆ పాత్రలో చాలా షేడ్స్ ఉంటాయి. అందుకే రావణుడుగా చేయడానికి ఒప్పుకున్నాను” అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం యష్ వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌గా మారాయి. మరి ఈ సినిమాతో బాలీవుడ్ ఎలాంటి రికార్డులు బద్దలు కొడుతుందో చూడాలి.