- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
Sarangapani Jathakam: వాళ్లపై తప్పుడు కామెంట్ చేయలేదు.. అలేఖ్య చిట్టి పికిల్స్ ఇష్యూపై నటుడు క్లారిటీ

దిశ, సినిమా: ‘బలగం’ ఫేమ్ నటుడు ప్రియదర్శి (Priyadarshi) నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘సారంగపాణి జాతకం’ (Sarangapani Jathakam). ఇంద్రగంటి మోహన కృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఇందులో రూపా కొడువయూర్ (Rupa Koduvayur) హీరోయిన్‌గా నటిస్తుంది. ఇప్పటికే ఇందులో నుంచి వచ్చిన అప్‌డేట్ వినోదాత్మకంగా ప్రేక్షకులను ఆకట్టుకోగా.. తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు చిత్రం బృందం. ఇక ఈ ట్రైలర్ (Trailer) లాంచ్ ఈవెంట్‌లో పాల్గొన్న నటుడు ప్రియదర్శి అలేఖ్య చిట్టి పికిల్స్ (Alekhya Chitti Pickles) ఇష్యూపై క్లారిటీ ఇచ్చారు. ‘ఇంటర్‌నెట్‌లో సాగుతున్న ఓ మేజర్ ట్రెండ్‌ను మేము కూడా ఫాలో అయ్యి.. దాని ద్వారా ప్రమోషన్స్ చేద్దాం అనుకున్నాం. సినిమాలో ఓ కామెడీ స్క్రిప్ట్ చూసి అలాగే అంటుంటాం కదా.. ఇది కూడా అంతే.. అదే ఉద్దేశ్యంతో నేను కూడా పచ్చడ్లు అమ్ముకుంటా అన్నాను అంతే. కానీ మేము ఖచ్చితంగా చెప్తున్నాము.. ఎక్కడా కూడా వాళ్ల పచ్చడ్ల గురించి కానీ, ఆ అమ్మాయిలా మీద కానీ మేము ఏలాంటి కామెంట్ చేయలేదు’ అంటూ చెప్పుకొచ్చాడు.
కాగా.. ఈ చిత్రం భారీ అంచనాల మధ్య ఏప్రిల్ 18న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉంది. దీంతో ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన చిత్ర బృందం.. ఇటీవల ఓ ప్రమోషనల్ వీడియోను షేర్ చేశారు. అందులో.. ప్రియదర్శి జాతకం బుక్ చూస్తూ ఉంటాడు. పక్కనే కూర్చున్న హీరోయిన్ తన ఫోన్‌లో ఓ డ్రెస్‌ను చూపిస్తూ ఇది ఎంత బాగుందో కదా అంటుంది. ఇక సారంగపాణి (ప్రియదర్శి) ఆ డ్రెస్ చూసి వావ్ చాలా బాగుంది అంటూ.. దాని కాస్ట్ చూసి షాక్ అవుతాడు. రూ. 14,999 ఉండటంతో ఇంత రేటా చాలా ఎక్కువ అంటాడు. దానికి హీరోయిన్.. ‘నువ్వు కెరీర్‌పైన ఫోకస్ పెట్టాలమ్మా.. రేపు నీ పెళ్లామో, గర్ల్ ఫ్రెండో ఇలాగే డ్రెస్ చూపించినప్పుడు ఎక్స్‌పెన్సీవ్ అన్నావు అనుకో వదిలిపడేస్తాది నిన్ను. నువ్వు దయచేసి ఈ ప్రేమలు పెళ్లిల్లు జోలికిపోకు ఇప్పుడే. ముష్టి డ్రెస్సే ఎక్స్‌పెన్సీవ్ అంటున్నావు రేపు నీ పెళ్లం ఏ బంగ్లానో, బంగారమో అడిగితే ఏం కొంటావు.. ఈ పుస్తకం పక్కన పెట్టి కెరీర్‌పై ఫోకస్ పెట్టు’ అంటుంది. దానికి హీరో పచ్చడ్ల బిజినెస్ పెడతాను అంటూ చెప్పిన ఈ వీడియో వైరల్‌గా మారింది. దీనిపై ఇప్పుడు క్లారిటీ ఇచ్చాడు ప్రియదర్శి.