ఆర్మీ ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి

by Naveena |
ఆర్మీ ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
X

దిశ, గోదావరిఖని: అగ్ని వీర్ రిక్రూట్‌ మెంట్‌ టెస్టులో ఉత్తీర్ణతను సాధించేందుకు అందిస్తున్న ఉచిత శిక్షణను అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలని గోదావరిఖని ఏసీపీ ఎం. రమేష్ నిరుద్యోగులకు సూచించారు. బుధవారం సి ఆర్ క్లబ్ లో అగ్ని వీర్ ఆర్మీ రిక్యూమెంట్‌ ఫిజికల్, రాత పరీక్షకు సన్నదం అయ్యే అభ్యర్థులకు ఉచిత శిక్షణ లో ఆయన మాట్లాడారు. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులకు రాత పరీక్ష, దేహదారుడ్య శిక్షణను సద్వినియోగం చేసుకోవాలన్నారు. స్టేడియంలో రిటైర్డ్‌ ఆర్మీ జవాన్ల పర్యవేక్షణలో రన్నింగ్‌, మెడికల్‌, ఫిజికల్‌ టెస్టులు అర్హత సాధించడానికి అన్ని రకాల శిక్షణ ఇవ్వడం ఇస్తున్నామన్నారు. దీన్ని సద్వినియోగం చేసుకోని ఉద్యోగ సాధనకై పట్టుదలతో నిరంతర శ్రమ పడాలన్నారు. పిల్లలు ఉన్నత స్థాయిలో ఉండాలని, ఉద్యోగాలు సాదించాలనే తల్లిదండ్రుల కోరికను నెరవేర్చాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం లో గోదావరిఖని ఇన్స్పెక్టర్ ఇంద్ర సేనా రెడ్డి, ఇంచార్జి మహిపాల్‌రెడ్డి, టీచింగ్ ఫాకల్టీ పాల్గొన్నారు.



Next Story

Most Viewed