రూ.2,950 కోట్ల బాండ్ స్కామ్ కేసులో వియత్నాం వ్యాపారవేత్తకు 8 ఏళ్ల జైలు శిక్ష

by Disha Web Desk 17 |
రూ.2,950 కోట్ల బాండ్ స్కామ్ కేసులో వియత్నాం వ్యాపారవేత్తకు 8 ఏళ్ల జైలు శిక్ష
X

దిశ, నేషనల్ బ్యూరో: వియత్నాంకు చెందిన విలాసవంతమైన కార్యాలయాలు, అపార్ట్‌మెంట్లను కలిగి ఉన్నటువంటి Tan Hoang Minh గ్రూప్ అధినేత దో అన్హ్ డంగ్‌కి రూ.2,950 కోట్ల బాండ్ స్కామ్ కేసులో భాగంగా అక్కడి కోర్టు 8 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. ఆయనతో పాటు అతని కుమారుడు దో హోయాంగ్ వియెట్‌కు కూడా మూడేళ్ల జైలు శిక్ష విధించగా, మరో 13 మంది నిందితులకు రెండున్నర సంవత్సరాల వరకు జైలు శిక్ష విధించారు.

బాండ్లను జారీ చేసి 6,600 మంది పెట్టుబడిదారుల నుంచి అక్రమంగా నిధులు పొందారని వారిపై ఉన్న ప్రధాన ఆరోపణ. పెట్టుబడిదారులకు అధిక రాబడి ఇస్తామని పేర్కొనగా వారు Tan Hoang Minh సంస్థ బ్రాండ్‌ను నమ్మి బాండ్లను కొనుగోలు చేశారు. తీరా వారిని మోసం చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

అయితే ఈ స్కామ్‌లో భాగంగా నిందితులు తమ నేరాన్ని అంగీకరించారు. పెట్టుబడిదారులను మోసం చేయడానికి ఎలాంటి ఉద్దేశం లేదని, సంస్థ ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరించడానికి మాత్రమే ఇలా చేసినట్లు తెలిపారు. ఇది బాధాకరమైనది, తీవ్ర పశ్చాత్తాప పడుతున్నాను, పెట్టుబడిదారులకు క్షమాపణలు అని గ్రూప్ అధినేత డంగ్‌ కోర్టుకు తెలిపారు.


Next Story

Most Viewed