- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
US warns Iran: ట్రంప్ కి ఏదైనా జరిగితే యుద్ధంగానే పరిగణిస్తాం.. ఇరాన్ కి అమెరికా హెచ్చరికలు
దిశ, నేషనల్ బ్యూరో: ఇరాన్ కు అమెరికా హెచ్చరికలు జారీ చేసింది. అమెరికా అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ టెహ్రాన్ హిట్ లిస్టులో ఉన్నారు. దీన్ని అమెరికా సీరియస్ గా తీసుకుంది. ట్రంప్ కు వ్యతిరేకంగా ఏదైనా కుట్ర చేస్తే.. దాన్ని యుద్ధాన్ని ప్రేరేపించే చర్యగా భావిస్తామని అధికారులు తెలిపారు. ట్రంప్ భద్రతకు సంబంధించి బైడెన్ అప్ డేట్లు నిరంతరం తెలుసుకుంటున్నారని.. తగిన చర్యలకు ఆదేశిస్తున్నారని వెల్లడించారు. ఇరాన్ కుట్రలపై దృష్టిపెట్టాలని బైడెన్ సూచించినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా ఇరాన్‌లో ఉన్నతస్థాయి అధికారులకు బైడెన్ సూచనల మేరకు ఈ సందేశాన్ని పంపినట్లు తెలుస్తోంది. ట్రంప్ హత్యాయత్నానికి కుట్రలు చేయడాన్ని వెంటనే ఆపేయాలని కోరినట్లు సమాచారం. మరోవైపు, తాము అమెరికా వ్యవహారాల్లో జోక్యం చేసుకోవట్లేదని ఇరాన్ స్పష్టం చేసింది. కానీ, అగ్రరాజ్యం మాత్రం తమ అంతర్గత వ్యవహారాల్లో ఏళ్ల తరబడి జోక్యం చేసుకుంటుందని ఆరోపించింది. 1953 తిరుగుబాటు నుంచి 2020లో జరిగిన ఖాసీం సులేమానీ హత్య వరకు అంతా అమెరికానే చేసిందని ఇరాన్ అధికారులు అంటున్నారు.
ట్రంప్ పై వరుస హత్యాయత్నాలు
ఇప్పటికే ట్రంప్ పై వరుసగా హత్యాయత్నాలు జరిగాయి. దీంతో బైడన్ సర్కారు ట్రంప్ కోసం భద్రతను మరింతగా పెంచింది. అంతేకాకుండా, గత నెల ట్రంప్ ప్రచారబృందం సంచలన ప్రకటన చేసింది. ‘యూఎస్‌లో అస్థిరత, గందరగోళాన్ని సృష్టించాలని ఇరాన్ ప్రయత్నిస్తుంది. ట్రంప్ కు ఇరాన్ నుంచి ముప్పు ఉన్నట్లు ఇంటెలిజెన్స్ కార్యాలయం హెచ్చరించింది’ అని ట్రంప్ ప్రచార బృందం పేర్కొంది. అంతేకాకుండా, కొన్ని నెలలుగా ఇరాన్ బెదిరింపులు పెరిగిపోయాయని అధికారులు గుర్తించినట్లు తెలిపింది.