- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
US-Israel: హమాస్‌పై విజయం సాధించడానికి అమెరికా సపోర్ట్ కావాలి: ఇజ్రాయెల్ PM
దిశ, నేషనల్ బ్యూరో: హమాస్‌పై జరుగుతున్న యుద్ధంలో అలాగే, ఇరాన్ మద్దతు గల గ్రూపులతో జరుగుతున్న పోరాటంలో విజయం సాధించడానికి అమెరికా సపోర్ట్ కావాలని ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు అన్నారు. US కాంగ్రెస్‌లో మాట్లాడిన ఆయన, నాగరికత శక్తులు విజయం సాధించాలంటే, అమెరికా-ఇజ్రాయెల్ కలిసి పోరాడాలని, మా యుద్ధం మీ యుద్ధమే.. మా శత్రువులు మీకు శత్రువులే.. మా విజయం మీ విజయమే అని పిలుపునిచ్చారు. ఇంకా మధ్యప్రాచ్యంలో, ఉగ్రవాదం, అల్లకల్లోలం, గందరగోళం, హత్యల వెనుక ఇరాన్ ఉందని ఆయన ఆరోపించారు.
ఇటీవల కాలంలో మిడిల్‌ఈస్ట్‌లో జరుగుతున్న దాడులతో తీవ్ర ఆందోళనలు నెలకొన్నాయి. ముఖ్యంగా ఇజ్రాయెల్‌పై ప్రపంచదేశాలు చాలా కోపంగా ఉన్నాయి. ఐక్యరాజ్యసమితి సైతం గాజాలో చేస్తున్న దాడులను ఆపాలని ఇజ్రాయెల్‌కు సూచించినప్పటికి నెతన్యాహు వెనక్కి తగ్గటం లేదు. హమాస్‌ను పూర్తిగా అంతం చేసే వరకు యుద్ధాన్ని ఆపే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో US కాంగ్రెస్‌లో ఇజ్రాయెల్ ప్రధాని కీలకం ప్రసంగం చేయడం గమనార్హం. దాదాపు గంటసేపు ఆయన ప్రసంగించారు.
ఆయన మాట్లాడుతున్న సమయంలో ఇజ్రాయెల్‌కు సైనిక సహాయాన్ని నిలిపివేయాలని అమెరికాను డిమాండ్ చేస్తూ పాలస్తీనా అనుకూల నిరసనకారులు వాషింగ్టన్ యూనియన్ స్టేషన్ వెలుపల పాలస్తీనా జెండాలను ఎగురవేశారు. అలాగే, 60 మందికి పైగా డెమొక్రాట్లు, రాజకీయ స్వతంత్ర బెర్నీ శాండర్స్ బెంజమిన్ నెతన్యాహు ప్రసంగాన్ని బహిష్కరించారు. US కాంగ్రెస్‌లో నెతన్యాహు ఇలా ప్రసంగం చేయడం నాల్గవ సారి.